తిరుమల అన్నప్రసాద కేంద్రం, లగేజీ కౌంటర్ల వద్ద ఇకపై కొత్తగా.. !!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మరింత పారదర్శక, ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందించడానికి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో భక్తుల నుంచి స్వీకరిస్తోన్న అభిప్రాయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, అవసరమైన మార్పులు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది.

ఈ దిశగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి.. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఈ భేటీ ఏర్పాటైంది. భక్తుల అభిప్రాయ సేకరణ వ్యవస్థ పనితీరు, వివిధ విభాగాలకు అందుతోన్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించడంపై ఇందులో విస్తృతంగా చర్చించారు. తిరుమలకు విచ్చేసే ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనాన్ని అందించడమే లక్ష్యంగా వివిధ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అదనపు ఈవో సూచించారు.

TTD Plans to establish a reception counter at the Annaprasadam complex and CCTV at luggage counters

టీటీడీలోని ప్రతి విభాగం కూడా భక్తుల నుంచి వచ్చే సూచనలను సానుకూలంగా స్వీకరించాలని, అవి.. ఆయా విభాగాలు తమ, తమ సేవలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయని వెంకయ్య చౌదరి అన్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దీనివల్ల భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే: జెండా సైతం ఆవిష్కరణ
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే: జెండా సైతం ఆవిష్కరణ

ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రానికి వచ్చే భక్తులకు మార్గదర్శకత్వం, పూర్తి సమాచారాన్ని అందించడానికి కు వీలుగా త్వరలోనే అక్కడ ఒక ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. దీంతో పాటు కాటేజీలు, వసతి సముదాయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు, నీరు, విద్యుత్ వనరుల పొదుపుపై భక్తులలో అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో అధికారులు నిర్ణయించారు.

సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!
సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!

టీటీడీ నందకం యాప్ పనితీరును నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై భక్తులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, వాటిని గుర్తించిన 24 గంటల వ్యవధిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ సేవల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాంకేతిక వ్యవస్థలు మెరుగ్గా పనిచేసేలా సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు.

175/175: సాయిరెడ్డి పీఆర్పీ లక్ష్యం ఇదే- సీఎం విజయ్ స్ఫూర్తి
175/175: సాయిరెడ్డి పీఆర్పీ లక్ష్యం ఇదే- సీఎం విజయ్ స్ఫూర్తి

లగేజీ కౌంటర్ల వద్ద పారదర్శకత పెంచడంలో భాగంగా సీసీటీవీ కెమెరాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని అదనపు ఈఓ సూచించారు. భక్తులు తమ సలహాలు, సూచనలు లేదా ఫిర్యాదులను నేరుగా నమోదు చేసేలా లగేజీ కౌంటర్ల ప్రాంగణాల్లో కంప్లైంట్ బాక్స్ లను ఏర్పాటు చేయనున్నారు. లగేజీ భద్రతపై భక్తులలో నమ్మకాన్ని పెంచడంతో పాటు, క్షేత్రస్థాయి సిబ్బంది జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఈ చర్యలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+