ఓ మై గాడ్.. రూ.13 వేల కోట్లు విరాళంగా ఇచ్చేసిన బిలియనీర్ !
ప్రముఖ యాడ్-టెక్ దిగ్గజ సంస్థ యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley) మానవత్వంచాటుకున్నారు. తన సంపాదనలో అధిక భాగాన్ని సమాజ సేవ కోసం విరాళంగా ఇచ్చారు. ప్రముఖ మ్యాగజైన్ తెలిపిన ప్రకారం.. 2018లో బ్రియాన్ ఓ కెల్లీ తన కంపెనీ యాప్ నెక్సస్‌ను అమ్మడం ద్వారా దాదాపు 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.13 వేల కోట్లు) సంపాదించారు.
ఈ క్రమంలోనే అమ్మకానికి తర్వాత తన కుటుంబ భవిష్యత్ కోసం కేవలం 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.830 కోట్లు) మాత్రమే ఉంచుకున్నారు. మిగతా భాగాన్ని AT&T సంస్థకు ఇవ్వడం ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించేందుకు విరాళం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ నిర్ణయం ఆయన ఒంటరిగా తీసుకున్నది కాదని.. భార్యతో చర్చించి, కుటుంబ అవసరాలకు సరిపడే మొత్తాన్ని మాత్రమే ఉంచుకున్నారని సమాచారం. పిల్లలకు విలాసవంతమైన జీవితం అవసరం లేదని.. విలువలతో, పరిమితులతో కూడిన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
అంతే కాకుండా అధిక సంపద మనల్ని ప్రజల నుంచి, సమాజం నుంచి దూరం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అది బాధ్యతా రాహిత్యమైన ఖర్చులకు దారి తీస్తుందని కెల్లీ తెలిపారు. బిలియనీర్ గా ఉండటం తాను అసలు కోరుకోలేదని.. అలాంటి జీవనశైలిని అనుసరించాలన్న ఆలోచనే లేదని చెప్పుకొచ్చారు.
త్వరలోనే కొత్త స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు బ్రియాన్ వివరించారు. అయితే మరోసారి బిలియనీర్ కావాలని, అధిక సంపద కోసం పరుగులు తీయాలని మాత్రం అనుకోవడం లేదన్నారు.
కొత్త వ్యాపారాలు కూడా విలువల ఆధారంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో బ్రియాన్ ఓ కెల్లీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన విరాళం ద్వారా అనేక సామాజిక, విద్యా, ఆరోగ్య, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించబడనున్నాయి.












Click it and Unblock the Notifications