కరోనా చికిత్సలో మాత్రలకు ఆమోదం తెలిపిన తొలి దేశంగా బ్రిటన్: సరికొత్త అధ్యాయమే

లండన్: కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఇప్పటి వరకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కూడా టీకా, వ్యాక్సిన్లనే నమ్ముకున్నాయి. అయితే, తాజాగా, బ్రిటన్ కొత్త అధ్యయానానికి నాంది పలికింది. కరోనా చికిత్స విధానంలో మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ మాత్ర(పిల్స్)లను గురువారం బ్రిటన్ ఆమోదించింది. దీంతో ఈ తరహా చికిత్సకు పచ్చజెండా ఊపిన మొదటి దేశంగా నిలిచింది.

కరోనా చికిత్సకు ఆమోదం పొందిన మొదటి ఓరల్ యాంటీవైరల్ చికిత్స ఇదే కావడం విశేషం. కరోనా పాజిటివ్‌గా తేలితే.. వీలైనంత త్వరగా లేదా లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు మోల్నుపిరవిర్ మాత్రలను వాడాలని ఇక్కడి మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యూలేటరీ ఏజెన్సీ(ఎస్హెచ్ఆర్ఏ) సిఫార్సు చేసింది. బ్రిటన్ లో మోల్నుపిరవిర్‌ను లగేవ్రియో అనే బ్రాండ్‌తో రూపొందించారు.

Britain becomes first country to approve Mercks coronavirus antiviral pill

కాగా, కరోనా చికిత్సలో మోల్నుపిరవిర్‌ను వినియోగించాలా వద్ద అనే అంశంపై అమెరికా మెడిసిన్ రెగ్యూలేటరీ నిపుణులు నవంబర్ నెలలో సమావేశం కానున్న తరుణంలోనే బ్రిటన్ ఈ పిల్స్‌కు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనావైరస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ చికిత్స ప్రారంభిస్తే.. రోగి ఆస్పత్రి పాలవ్వడం, మరణించే అవకాశాలను సగానికి తగ్గించగలదని ట్రయల్స్‌లో తేలడం గమనార్హం.

Recommended Video

    Secret British-Era Tunnel Found In Delhi Assembly, Leads To Red Fort | Oneindia Telugu

    ఈ చికిత్స విధానంలో బ్రిటన్ ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఇప్పటికే 4.80 లక్షల మాత్రల కోసం మెర్క్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరి నాటికి కోటి మాత్రలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెర్క్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో కనీసం రెండు కోట్ల మాత్రలను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. కాగా, బ్రిటన్‌లో ఇటీవల మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం కోరుతోంది. ఐరోపాలు కరోనా కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ ఎత్తున మరణాలు సంభవించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+