వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీగిన అవిశ్వాస తీర్మానం: గట్టెక్కిన ప్రధాని: అయినా..పొంచివున్న సంక్షోభం

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కారు. ఈ తీర్మానంపై నిర్వహించిన పోలింగ్ సందర్భంగా ఆయనకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ.. సంక్షోభ ముప్పు మాత్రం తొలగిపోలేదు. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో అధికార పార్టీకి చెందిన పలువురు కీలక సభ్యులు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనకు పదవీ గండం పొంచివుందనే సంకేతాలు పంపించినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఓటింగ్ ఇలా..

ఓటింగ్ ఇలా..


బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగాలా? వద్దా అనే విషయంపై అధికార కన్జర్వేటివ్ పార్టీలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ కమిటీ ఛైర్మన్ గ్రాహం బ్రాడీ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆ దేశ పార్లమెంట్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 359 మంది సభ్యుల బలం ఉంది. వారందరూ ఈ తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌లో పాల్గొన్నారు. 211 మంది బోరిస్ జాన్సన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. 148 మంది ఆయనను వ్యతిరేకించారు. ఈ తీర్మానం నెగ్గాలంటే కనీసం 180 ఓట్లు అవసరమౌతాయి.

వీకెండ్ పార్టీలతో..

వీకెండ్ పార్టీలతో..

2020లో కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరించిన పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్రొటోకాల్‌, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి- వీకెండ్ పార్టీలకు హాజరయ్యారనే ఆరోపణలను బోరిస్ జాన్సన్ ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. చట్టాన్ని, నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆయన జరిమానాలను సైతం చెల్లించాల్సి వచ్చింది. తన అధికారిక నివాసం నంబర్ 10, డౌనింగ్ స్ట్రీట్‌లో వీకెండ్ పార్టీల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు చక్కర్లు కొట్టాయి.

పార్టీ ఎన్నుకున్న నాయకుడే..

పార్టీ ఎన్నుకున్న నాయకుడే..

దీన్ని పార్టీ గేట్ స్కాండల్‌గా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కన్జర్వేటివ్ పార్టీ- ఈ అవిశ్వాస తీర్మానాన్ని నిర్వహింది. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా నేరుగా ప్రధానిని ఎన్నుకునే విధానం బ్రిటన్‌లో లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన పార్టీ.. ఎన్నుకున్న నాయకుడే ప్రధాని అవుతాడు. ఈ ఓటింగ్‌లో గనక బోరిస్ జాన్సన్ ఓడిపోయివుంటే.. బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ.. మరొకరిని ఎన్నుకుని ఉండేది.

వ్యతిరేకత పెరిగినట్టే..

వ్యతిరేకత పెరిగినట్టే..

కాగా- ఈ అవిశ్వాస తీర్మానంలో 148 మంది బోరిస్ జాన్సన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చనీయాంశమైంది. ఇందులో పలువురు సీనియర్లు ఉన్నారు. వారందరూ జాన్సన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. భవిష్యత్‌లో ఇది రాజకీయంగా ఆయనకు మరిన్ని ఇబ్బందులను తీసుకొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ.. క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

English summary
British Prime Minister Boris Johnson survived a no-confidence vote on Monday, securing enough support from his Conservative Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X