వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తన మార్క్ చూపిస్తున్న రిషి సునాక్: డిప్యూటీగా డొమినిక్ రాబ్, పాత మంత్రులకు చెక్

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన మార్క్ పాలనకు సిద్ధమయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దేందుకే తాను ప్రధాని పదవిలోకి వచ్చినట్లు ఇప్పటికే సునాక్ చెప్పిన విషయం తెలిసిందే.

ప్రధాని బాధ్యతను చేపట్టిన గంటల వ్యవధిలోనే రిషి సునాక్.. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే దిశగా అడుగులు ప్రారంభించారు. తన టీంను సిద్ధం చేసుకున్నారు. బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్‌ను నియమించారు సునాక్. అంతేగాక, ప్రస్తుత ఆర్థిక మంత్రిగా ఉన్న జెరిమీ హంట్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శిగా, బెన్ వాల్సేని డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు. పార్లమెంటరీ సెక్రటరీ(చీఫ్ విప్)గా సైమన్ హార్ట్‌ని నియమించారు. నదిమ్ జాహ్వికి మంత్రిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు ఏ శాఖను కేటాయించారో వెల్లడించలేదు.

Britain PM Rishi Sunak Sacks Several Ministers, Appoints Dominic Raab As Deputy PM

మరోవైపు, లిజ్ ట్రస్ టీంలో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని కోరినట్లు తెలిసింది. జాకబ్ రీస్ మాగ్, బ్రాండన్ లైవెస్, విక్కీ ఫోర్డ్‌ను తమ పదవుల నుంచి వైదొలగాలని సూచించినట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇది ఇలావుండగా, రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే లిజ్ ట్రస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామా చేసినవారిలో కిట్ మాల్తౌస్, రాబర్ట్ బక్‌ల్యాండ్, చ్లోల్ స్మిత్, రణిల్ జయవర్ధనె ఉన్నారు.

English summary
Britain PM Rishi Sunak Sacks Several Ministers, Appoints Dominic Raab As Deputy PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X