• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధానమంత్రికి కరోనా తీవ్రం: హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు: హోమ్ క్వారంటైన్‌లో గడిపి..

|

లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ లక్షణాలతో మొన్నటి దాకా హోమ్ క్వారంటైన్‌లో గడిపిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం.. దగ్గు, జలుబు, జ్వరం, తగ్గకపోవడం వల్ల ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనను ఏ ఆసుపత్రిలో చేర్చారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. భద్రతా కారణాల వల్లే ఆసుపత్రి పేరు, ఇతర వివరాలను గోప్యంగా ఉంచినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

భయపడిందే జరుగుతోందా?: జూలో పులికి సోకిన కరోనా: జంతువులకు సంక్రమిస్తోన్న వైరస్

10 రోజులుగా హోమ్ క్వారంటైన్..

10 రోజులుగా హోమ్ క్వారంటైన్..

బోరిస్ జాన్సన్ 10 రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యారు. దగ్గు, జ్వరం రావడంతో ఆయన విధులకు హాజరు కాలేదు. హోమ్ క్వారంటైన్‌లో కాలం గడిపారు. ఇంట్లోనే ఉంటూ వైద్య చికిత్సను అందించారు. 10 రోజుల తరువాత కూడా ఆయనకు జ్వరం తగ్గుముఖం పట్టకపోగా.. మరింత తీవ్రతరం అయ్యాయి. దీనితో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఆసుపత్రి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.

డాక్టర్ల సలహాల వల్లే..

డాక్టర్ల సలహాల వల్లే..

డాక్టర్ల సలహా మేరకు తాము ప్రధానమంత్రిని ఆసుపత్రికి తరలించినట్లు డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆయనను ఆసుపత్రిలో చేర్చామని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయన ఎప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. డాక్టర్లు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.

అత్యవసర తరలింపు కాదంటూ వివరణ..

అత్యవసర తరలింపు కాదంటూ వివరణ..

బోరిస్ జాన్సన్‌ను రాత్రికి రాత్రి హుటాహుటిన ఆసుపత్రికి చేర్చడం పట్ల ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయనే ప్రధానమంత్రి వ్యవహరిస్తున్నారని, హోమ్ క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ.. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారిక కార్యకలాపాలను పర్యవేక్షించారనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానమంత్రి బాధ్యతలను మరొకరికి అప్పగించాలనే విషయంపై ఎలాంటి చర్చా జరగలేదని చెప్పారు.

డొమినిక్ రాబ్‌కు ప్రధాని బాధ్యతలు..

డొమినిక్ రాబ్‌కు ప్రధాని బాధ్యతలు..

బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించడమంటూ జరిగితే.. ఆయన బాధ్యతలను డొమినిక్ రాబ్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనను డిజిగ్నేటెడ్ మినిస్టర్‌గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బ్రిటన్ కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 9:15 నిమిషాలకు ఆయన బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బోరిస్ జాన్సన్ భార్యకు కూడా..

బోరిస్ జాన్సన్ భార్యకు కూడా..

బోరిస్ జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు కూడా కరోనా వైరస్ సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, వైరస్ నుంచి కోలుకున్నానంటూ క్యారీ సిమండ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నారు. యుకేలో ఇప్పటికే కరోనా వైరస్ వల్ల 4934 మంది మరణించారు. 47,806 మందిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రముఖులు హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.

English summary
British Prime Minister Boris Johnson has been admitted to hospital due to Covidi-19 coronavirus after suffering 10 days of symptoms including a high fever, bringing doubts about his capability to lead the response to the pandemic despite No 10 insisting it was purely precautionary. Johnson was taken to an unnamed London hospital on Sunday after days of persistent symptoms, during which time he has been self-isolating. Last week No 10 had denied the prime minister was more seriously ill than claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more