Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొరుక్కుని తింటోన్న కరోనా: ప్రధాని ఆరోగ్యం అత్యంత విషమం: అధికారం బదలాయింపు..!

లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం విషమించింది. ఒక్కరోజు వ్యవధిలో ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారింది. ఆసుపత్రిలో చేరిన 24 గంటల వ్యవధిలో బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే ఆయనను ఐసీయూకు తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మరోవంక- బ్రిటన్‌లో అధికార మార్పిడి జరిగిపోయింది. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా డొమినిక్ రాబ్‌ను నియమించారు. బోరిస్ జాన్సన్ ఆరోగ్యం కుదుటపడేంత వరకూ డొమినిక్ రాబ్ ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తిస్తారు.

 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో

10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో

కరోనా వైరస్ లక్షణాలతో 10 రోజుల పాటు బోరిస్ జాన్సన్ హోమ్ క్వారంటైన్‌లో గడిపారు. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం.. దగ్గు, జలుబు, జ్వరం తీవ్రతరం కావడం వల్ల ఆయనను లండన్‌లోని ప్రఖ్యాత సెయింట్ థామస్ ఆసుపత్రికి తరలించారు. భద్రతా కారణాల వల్ల మొదట ఆసుపత్రి పేరును వెల్లడించని ప్రధానమంత్రి కార్యాలయం.. ఇప్పుడా పేరును బహిర్గతం చేసింది. యుకే కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఆయనను హోమ్ క్వారంటైన్ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆదివారం సాయంత్రం ఐసీయూలో చేర్చారు.

ఆరోగ్యం విషమించడంతో..

బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించంతో ఆయనను ఐసీయూలో చేర్చామని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ల సలహా మేరకు ఆయనను ఐసీయూకు తరలించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐసీయూలో ఆయనకు అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నారని చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతారని అన్నారు.

ఆరోగ్యం విషమించడంతో..

బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించంతో ఆయనను ఐసీయూలో చేర్చామని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ల సలహా మేరకు ఆయనను ఐసీయూకు తరలించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐసీయూలో ఆయనకు అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నారని చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతారని అన్నారు.

ప్రధానిగా డొమినిక్ రాబ్..

ప్రధానిగా డొమినిక్ రాబ్..

బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బాధ్యతలను డొమినిక్ రాబ్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనను డిజిగ్నేటెడ్ మినిస్టర్‌గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విదేశాంగ మంత్రిగా డొమినిక్ రాబ్ బాధ్యతలను తీసుకున్నారు. తాజాగా- ప్రధానమంత్రి బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

Recommended Video

    Man Vs Wild : Rajinikanth With Bear Grylls, New Promo Out!

    దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మోడీ

    బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మోడీ ఓ ట్వీట్ చేశారు. తన మిత్రుడు బోరిస్ జాన్సన్ ఐసీయూలో చేరడం బాధ కలిగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయనకు అత్యుత్తమ వైద్యాన్ని అందించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+