థాయ్‌లాండ్‌లో బస్సు ప్రమాదం: 20 మంది సజీవ దహనం

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌ సరిహద్దు నుంచి బ్యాంకాక్‌ వైపు వెళ్తున్న ఓ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో సుమారు 47 మంది ప్రయాణీకులున్నారు.

థాయ్‌లాండ్ నుండి బ్యాంకాక్ వైపు వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకొంది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణీకులు ఉన్నారు.థాయ్‌లాండ్‌లోని వాయువ్య టాక్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది.

Bus fire kills 20 Myanmar migrants in Thailand

బస్సులో చీకటిగా ఉండడం వల్లే ప్రయాణీకులు బస్సు నుండి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీంతోనే మృతుల సంఖ్య ఇంకా పెరిగిందని ప్రత్యక్షసాక్షులు అభిప్రాయపడ్డారు.

మృతులంతా మయన్మార్ ‌కు చెందిన వలస కార్మికులే. ఘటనాస్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+