మసూద్ అజర్‌పై నిషేధాన్ని అడ్డుకొన్న చైనా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మసూద్‌ అజర్‌ విషయంలో చైనా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారత రక్షణ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పఠాన్‌కోట్‌ దాడికి సూత్రధారి అయిన మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ ఐక్యరాజ్య సమితిని ఇండియా ఆశ్రయించింది.

భద్రతామండలిలోని 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైనా దానిని వరుసగా నాలుగోసారి అడ్డుకుంది.

By blocking Masood Azhar ban, China misusing veto power and ignoring global views: Defence experts

ఐక్యరాజ్యసమితిలో చైనా ప్రవర్తించిన విధానంతో భారత్‌తో బంధాలు ప్రమాదకరస్థాయిలోకి వెళ్లే అవకాశముందని రక్షణ శాఖ నిపుణులు పీకే సింగ్‌ తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో చైనా తనకు ఉన్న వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌తో బంధాన్ని చైనా కాదనుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం విషయంలో చైనా అసుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు ఇదొక తార్కాణమని మరో రక్షణశాఖ నిపుణుడు రాహుల్‌ జలాల్‌ అన్నారు.

మసూద్‌ అజర్‌ విషయంపై చైనా విదేశాంగ శాఖ కార్యదర్ధి హు చునియాంగ్‌ మాట్లాడుతూ.. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో కొన్ని అభిప్రాయబేధాలున్నాయని చెప్పారు. మసూద్‌ అజర్‌పై భారత్‌ చాలా అంశాలకు వివరణ ఇవ్వలేదని ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Defence experts on Friday slammed China for blocking Indias request at the United Nations Security Council to declare Pakistan-based Jaish-e-Mohammed (JeM) chief Masood Azhar as a global terrorist.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి