'రెడ్ లైట్ ఏరియానే సో సేఫ్' అంటున్నారు

Subscribe to Oneindia Telugu

కాలీఫోర్నియా : "రెడ్ లైట్ ఏరియా.." పేరులో రెడ్ ఉంది గానీ అక్కడంతా ప్రశాంతమే అంటున్నారు కాలిఫోర్నియా పరిశోధకులు. రెడ్ లైట్ ఏరియాలో నివసించేవాళ్లే సో హ్యాపీగా ఉంటున్నారని తాజాగా నివేదిక ద్వారా వెల్లడించారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలీఫోర్నియాకు చెందిన కొంతమంది పరిశోధకులు.. మొత్తం 18 దేశాల్లోని రెడ్ లైట్ ఏరియాలపై పరిశోధనపై ఈ నివేదికను వెల్లడించారు. నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. రెడ్ లైట్ ఏరియాలో నివసించే చాలామంది సంతోషంగా ఉండడమే గాక, భద్రత పరంగాను వారంతా పూర్తి సంత్రుప్తితో ఉన్నారని వెల్లడించింది.

California university research on Red Light Areas

వేశ్యలతో, విటులతో ఎప్పుడూ బిజీగా ఉండే రెడ్ లైట్ ఏరియా వీధుల్లో ఓ చిన్న పాన్ షాపు పెట్టుకున్నా.. జీవితానికి ఢోకా ఉండదని చాలామంది రెడ్ లైట్ ఏరియా ప్రజలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వచ్చిపోయే విటులను చూడడం ఓ కాలక్షేపంగా భావిస్తామని, కాలక్షేపంగా ప్రత్యేకంగా టీవీ కూడా అవసరం లేదని తెలిపారట.

ఇక రెడ్ లైట్ ఏరియాలపై పోలీసుల కన్ను ఎప్పుడూ ఉంటుంది కాబట్టి.. దొంగల భయం కూడా అవసరం లేదని మరికొంతమంది అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే అతికొద్ది మాత్రం రెడ్ లైట్ ఏరియాల నుంచి వేశ్యా గృహాల మకాం మార్చాలని కోరుకుంటున్నట్లుగా పరిశోధనలో తేలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
California university made a research on Red Light Areas. The research scholars taken their opinion about living in red light area. They said surprising opinions regarding their life in those areas

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి