కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం ? జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు..
భారత్- కెనడా మధ్య ప్రత్యేక ఖలిస్తాన్ దేశం విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే భారత్ తీవ్రవాదులుగా గుర్తించిన ఖలిస్తాన్ నేతలకు ఆశ్రయం ఇస్తున్న కెనడా.. వారి హత్యల్లో భారత్ జోక్యం ఉందంటూ చేస్తున్న ఆరోపణలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ను కెనడాలో హత్య చేయడం వెనుక భారత్ పాత్ర ఉందంటూ కెనడా చేసిన ఆరోపణల చిచ్చు చల్లారకముందే మరో సంచలన ఆరోపణ చేస్తోంది.
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కెనడా నిఘా వర్గాల నివేదికలను ప్రస్తావిస్తూ భారత్ పై జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. గతంలో ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ ఆరోపించిన ట్రూడో ఇప్పుడు ఏకంగా తమ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

కెనడా సెక్యురిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ నివేదికను ఆధారంగా చేసుకుని గ్లోబల్ న్యూస్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది.ఫారిన్ ఇంటర్‌ఫరెన్స్ అండ్ ఎలక్షన్స్- ఎ నేషనల్ సెక్యూరిటీ అసెస్‌మెంట్ పేరుతో విడుదలైన ఈ నివేదికలో భారత్‌ను ముప్పుగా పేర్కొంది. విదేశీ జోక్యం కెనడా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని హెచ్చరించింది. విదేశీ జోక్యం సాంప్రదాయ దౌత్యానికి భిన్నంగా ఉంటుందని, ఎందుకంటే ఇది బహిరంగ కథనాలు, విధాన రూపకల్పనను ప్రభావితం చేయడానికి గోప్యత, మోసాన్ని ఉపయోగించిందని గ్లోబల్ న్యూస్ నివేదిక తెలిపింది.












Click it and Unblock the Notifications