వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీన్ రివర్స్: ఇంత ఎక్కువ జీతాలా? బాబోయ్.. మాకొద్దు, డాక్టర్ల ఆందోళన, ఎక్కడంటే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అటావా: సాధారణంగా ఎక్కడైనా ఉద్యోగులు తమ జీతాలు పెంచాలని కోరుతూ ఆందోళన చేస్తారు. కానీ కెనడాలో మాత్రం కథ రివర్స్‌లో జరుగుతోంది. జీతాలు ఎక్కువగా పెంచారంటూ అక్కడి డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమకు అధిక జీతాలు వద్దంటూ వందలాది మంది కెనడియన్ డాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

700 మందికిపైగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఈ మేరకు ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారు. నర్సులపై పడుతున్న పనిభారాన్ని, ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాల కల్పన ప్రాధాన్యతను వారు ఆ లేఖలో పేర్కొనడం విశేషం. అంతేకాదు, పెంచిన జీతాలను ప్రజా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, రోగుల అవసరాలు తీర్చడానికి వినియోగించాలని డిమాండ్ చేశారు.

Canadian doctors reject pay raises, say they already earn too much

కెనడాలో మెడికల్ ఫెడరేషన్ ఇటీవల జీతాలు పెంచగా దాన్ని క్యూబెక్ వైద్యులు వ్యతిరేకించారు. 213 జనరల్‌ ప్రాక్టీషనర్స్‌, 184 స్పెషలిస్టులు, 149 రెసిడెంట్‌ మెడికల్‌ డాక్టర్లు, 162 మంది మెడికల్‌ విద్యార్థులు.. పెరిగిన తమ జీతాలను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నర్సులు, రోగులు బాధలు పడుతున్నపుడు తమకు జీతాల పెంపు ఎందుకంటూ ప్రశ్నించారు.

పనిభారంతో నర్సులు బాగా అలసిపోతున్నారని, దీర్ఘకాలంగా సిబ్బంది కొరత కారణంగా ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తోందని కెనడియన్ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తమ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, ఇటీవల ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యల కారణంగా సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక రోగులు సతమతమవుతున్నారని కూడా వారు తెలిపారు.

పెరిగిన తమ జీతాలను రద్దు చేసి, వాటిని ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతిమంగా ఇది రోగి సంరక్షణా భాధ్యత మీద ప్రభావం చూపుతుందని అక్కడి వైద్యులు అంటున్నారు. మరి, కెనడియన్ డాక్టర్ల ఆలోచనా ధోరణిని ఇతర డాక్టర్లు కూడా పాటిస్తే ఎంత బాగుంటుంది కదా!

English summary
While thousands of workers around the world protest for higher wages, more than 700 doctors in Canada are protesting their own pay raises. The doctors belong to Médecins Québécois pour le Regime Public (MQRP), a public group of physicians from various regions of Quebec who advocate for the full implementation of the Canada Health Act.The MQRP took to their official website to oppose the recent salary increase as negotiated by Canada’s medical federations. The Quebec doctors then asked that the pay raises granted to them be revoked and given instead to other healthcare workers: “We, Quebec doctors, are asking that the salary increases granted to physicians be canceled and that the resources of the system be better distributed for the good of the health care workers and to provide health services worthy to the people of Quebec.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X