నీరవ్ మోడీని రప్పించేందుకు కేంద్రం యత్నాలు, 'సమస్య మాది పరిష్కరించుకుంటాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలోఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీని భారత్‌కు రప్పించేందుకు కేంద్రం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ నీరవ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు మరో ప్రయత్నం చేసింది.

నీరవ్‌కు చెందిన యూకే బ్యాంకు ఖాతాను జప్తు చేసేందుకు అవకాశం కల్పిచాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు అంగీకరించిన ప్రత్యేక సీబీఐ జడ్జి దీనిపై యూకే ప్రభుత్వానికి లెటర్‌ రొగాటరీ పెట్టారు.

 CBI moves plea to attach Nirav Modis UK bank account

యూకేలోని బార్‌క్లేస్‌ బ్యాంక్‌లో నీరవ్‌కు ఖాతా ఉంది. అందులో రూ.12కోట్లకు పైగా నగదు పౌండ్లు, డాలర్ల రూపంలో ఉంది. అయితే సదరు బ్యాంకు నీరవ్‌ మోడీ లిమిటెడ్‌తో సంబంధాలు తెంచుకోవాలని చూస్తోందని, ఆ ఖాతాలో ఉన్న మొత్తాన్ని నీరవ్‌కు తిరిగి చెల్లించాలని భావిస్తోందని సీబీఐ తెలిపింది. ఈ మేరకు తమ విచారణలో వెల్లడైనట్లు పేర్కొంది.

ఆ డబ్బు పీఎన్బీ నుంచి తీసుకున్నది కావొచ్చునని సీబీఐ చెబుతోంది. ఆ బ్యాంకు ఖాతాను జప్తు చేసేందుకు అవకాశమివ్వాలని పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఆర్‌ తాంబోలీ పిటిషన్‌ను అంగీకరించారు. దీనిపై యూకే ప్రభుత్వానికి లెటర్‌ రొగాటరీ జారీ చేశారు.

మరోవైపు,నీరవ్ మోడీ చేసిన రూ.13,000 కోట్ల అవకతవకల వల్ల ఎదురైన ఇబ్బందులను పరిష్కరించుకోవడంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధుల్ని కోరమని పీఎన్బీ స్పష్టం చేసింది. ఇది తమ బ్యాంకు సమస్య అని, దీనిని మేమే పరిష్కరించుకుంటామని, పెట్టుబడిధనం రూపంలో సాయం కోసం ప్రభుత్వాన్ని అడగబోమని బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CBI moves plea to attach Nirav Modi's UK bank account.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X