హోటల్ బిల్లు కంటే రెట్టింపు టిప్ , ఆనందంతో ఫోటో దిగిన సిబ్బంది

Posted By:
Subscribe to Oneindia Telugu

చికాగో: హోటల్ బిల్లు కంటే టిప్పు ఎక్కువగా చెల్లించడంతో ఆ హోటల్ సిబ్బంది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఘటన అమెరికాలోని చికాగోలో చోటు చేసుకొంది. రెస్టారెంట్‌లో సిబ్బంది చేసిన సర్వీసు కారణంగా హోటల్‌కు వచ్చిన ఓ వ్యక్తి హోటల్ బిల్లు కంటే ఎక్కువ టిప్పును ఇచ్చాడు.

అమెరికాలోని చికాగోలోని బొకా రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి డిన్నర్‌కు వెళ్ళారు. డిన్నర్‌కు సుమారు రూ.49,786 బిల్లు అయింది. యూఎస్ నగదులో సుమారు 759 డాలర్లు.

Chicago Restaurant Staff Get $2,000 Tip

బిల్లుతో పాటు సుమారు 300 డాలర్లను టిప్పుగా ఇచ్చాడు. తన కుటుంబానికి ఫుడ్ సర్వ్ చేసిన వారితో పాటు కిచెన్‌లో పనిచేస్తున్న వారితో ఆ వ్యక్తి నేరుగా వెళ్ళి మాట్లాడాడు. వారి కష్టసుఖాలను తెలుసుకొన్నాడు.ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్న 17 మందికి ఒక్కొక్కరికి వంద డాలర్ల చొప్పున చెల్లించాడు. ఈ మేరకు ఒక్కొక్కరికి సుమారు రూ.1,31,190 చెల్లించారు. అంటే హోటల్‌లో భోజనం చేసినందుకు ఆ వ్యక్తి సుమారు రూ.49,786 ఖర్చు చేశాడు.

కానీ, ఆ బిల్లు కంటే హోటల్‌లో పనిచేసేవారి కోసం రూ.1,31,190 ఇచ్చాడు. టిప్పు రూపేణా తిన్నదానికి చేసిన ఖర్చు కంటే అదనంగా చెల్లించాడు. ఆ వ్యక్తి దాతృత్వాన్ని చూసి సంతోషపడి హోటల్ సిబ్బంది అతడితో ఫోటో దిగారు. ఆయనకు సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
What is a reasonable tip at a restaurant?For most Americans, the answer is likely -- at most -- 20 percent. But how about 260 percent?For one patron at a Chicago restaurant, a normal tip was not enough to show his appreciation after a meal Sunday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి