వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిల్ డొనాల్డ్ చిల్! ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకున్న గ్రేటా థన్‌బర్గ్, 11 నెలల తర్వాత కసితీరా!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోటి దురద ఎక్కువేనని అందరికీ తెలిసిందే. మీడియా ప్రతినిధులతోపాటు దాదాపు తనకు ఎదురుచెప్పే ఎవరినీ కూడా వదిలిపెట్టకుండా విమర్శలు ఎక్కుపెట్టేవారు. స్వీడిష్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌పై కూడా గతంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు ట్రంప్. కాగా, అమెరికా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్రంప్‌పై థన్‌బర్గ్ ప్రతీకారం తీర్చుకుంది.

చిల్ గ్రేటా చిల్ అంటూ డొనాల్ ట్రంప్ సెటైర్లు..

ఆ వివరాల్లోకి వెళితే.. 2019లో గ్రేటా థన్‌బర్గ్ టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. అయితే, ఆ ఎంపికకను హేళన చేస్తూ అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ‘చాలా హాస్యాస్పదంగా ఉంది. గ్రేటా తన కోపాన్ని నియంత్రించుకునేందుకు తప్పక ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ పాత సినిమాకు వెళ్లండి! చిల్ గ్రేటా, చిల్!' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సరైన సమయంలో గ్రేట్ థన్‌బర్గ్ ప్రతీకారం..

ఈ నేపథ్యంలో గ్రేటా థన్‌బర్గ్.. సరైన సమయంలో ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. జో బైడెన్ ముందంజలో ఉండటంతో డొనాల్డ్ ట్రంప్ కొంత అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపు ఆపండి అంటూ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. దీనికే ఈ 17ఏళ్ల గ్రేటా థన్‌బర్గ్ కౌంటర్ ఇచ్చారు.

11 నెలల తర్వాత ట్రంప్‌పై కసితీర్చుకుంది..

‘ఇది చాలా హస్యాస్పదంగా ఉంది. డొనాల్డ్ తన కోపాన్ని నియంత్రించుకునేందుకు తప్పక ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ పాత సినిమాకు వెళ్లండి! చిల్ డొనాల్డ్, చిల్!'అంటూ గ్రేటా థన్‌బర్గ్ సరైన సమయంలో తన కసి తీరా ట్వీట్ చేసి ట్రంప్‌ వ్యవహారాన్ని ఎద్దేవా చేశారు. పర్యావరణ హితం కోసం పోరాటం సాగిస్తున్న గ్రేటా థన్‌బర్గ్.. ఈ ట్వీట్ చేయడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 11 నెలల తర్వాత గ్రేటా థన్‌బర్గ్ తన ప్రతీకారాన్ని తీర్చుకుందని అంటున్నారు. ఆమె ట్వీట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే జో బైడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు గ్రేటా థన్‌బర్గ్ ప్రకటించింది.

English summary
Revenge is a dish best served cold, and Greta Thunberg seems to know that. The 17-year-old climate activist waited 11 months before delivering a stinging burn to US President Donald Trump using his own words.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X