వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెళ్లిపోతారా, వెళ్లగొట్టమంటారా: భారత్‌కు చైనా వార్నింగ్, రోడ్డుపై ట్విస్ట్

భారత్ - చైనా సరిహద్దుల్లో, సిక్కిం సమీపంలోని డొక్లాం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

బీజింగ్/ఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దుల్లో, సిక్కిం సమీపంలోని డొక్లాం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత్‌కు చైనా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. డొక్లాం తమ పరిధిలోనిదేనని, భారత సైన్యం గౌరవంగా వెనుదిరిగితే బాగుంటుందని హెచ్చరించింది.

సరిహద్దులో తెగబడ్డ చైనా: పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని భారత్‌కు హెచ్చరిక!సరిహద్దులో తెగబడ్డ చైనా: పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని భారత్‌కు హెచ్చరిక!

లేదంటే తమ సైన్యంతో వెళ్లగొట్టించమంటారా అని పేర్కొంది. ఇందుకోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సరవ సన్నద్ధంగా ఉందని కూడా పేర్కొంది. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కటువు వ్యాఖ్యలతో కూడిన కథనం ప్రచురించింది.

మాదీ 1962 చైనా కాదు, అందుకే భారత్ ఇలా: రెచ్చగొట్టేలా డ్రాగన్ కంట్రీమాదీ 1962 చైనా కాదు, అందుకే భారత్ ఇలా: రెచ్చగొట్టేలా డ్రాగన్ కంట్రీ

మర్యాదగా వెళ్తారా లేక..

మర్యాదగా వెళ్తారా లేక..

'భారత జవాన్లు మర్యాదగా వెనక్కి వెళ్తారా.. లేదంటే చైనా సైన్యంతో వెళ్లగొట్టమంటారా..?' అని భారత్‌పై చైనా అధికారిక మీడియా హెచ్చరింపులకు దిగింది. అందులో తమ భూభాగాల నుంచి భారత బలగాలను వెళ్లగొట్టే శక్తి సామర్థ్యాలు చైనా సైన్యానికి ఉన్నాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొంది. అంతేగాక, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీపై కూడా విమర్శలు చేసింది.

జైట్లీ వ్యాఖ్యలు నిజమే కానీ,

జైట్లీ వ్యాఖ్యలు నిజమే కానీ,

భారత సైన్యం వెనక్కితగ్గకపోతే.. తమ దేశం యుద్ధానికి సిద్ధమేనని, జైట్లీ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, 2017 భారత్‌, 1962 నాటి పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఉందని, అయితే ఇప్పుడు యుద్ధం జరిగితే 1962 కన్నా భారత్‌ ఘోరంగా నష్టపోతుందని రెచ్చగొట్టేలా రాసింది. ఈసారి భారత్‌కు గుణపాఠం చెప్పి తీరాల్సిందేనంటూ రెచ్చగొట్టేలా రాసింది.

భారత్ పైనే బాధ్యత

భారత్ పైనే బాధ్యత

డోక్లామ్‌ పరిస్థితులపై అటు చైనా రాయబారి లూ చాంహుయ్‌ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమస్యపై రాజీ పడేది లేదని, వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని పేర్కొన్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రపంచాన్ని భారత్ పక్కదోవ పట్టిస్తోందని కూడా చైనా ఆరోపించింది. సిక్కిం సెక్టార్ లోని చికెన్స్ నెక్ ప్రాంతంలో చైనా సైనికులు రోడ్డును నిర్మిస్తున్నారని, దీని వల్ల తమ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ భారత్ ప్రచారం చేస్తోందని విమర్శించింది.

రోడ్డుపై చైనా ట్విస్ట్

రోడ్డుపై చైనా ట్విస్ట్

డొక్లాం ప్రాంతం భూటాన్, చైనా, ఇండియాల ట్రై జంక్షన్లో ఉందంటూ భారత్ చెబుతోందని, ఇది 1890 సైనో-బ్రిటన్ కన్వెన్షన్‌ను అగౌరవ పరచడమేనని మండిపడింది. 1890 కన్వెన్షన్ ప్రకారం తూర్పు పర్వతాల నుంచి సిక్కిం సెక్షన్ ప్రారంభమవుతుందని, తాము రోడ్డును నిర్మిస్తున్న ప్రాంతం గిప్మోచీ పర్వతానికి 2 వేల మీటర్ల దూరంలో ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జనరల్ షువాంగ్ తెలిపారు. ట్రై జంక్షన్‌కు, తాము రోడ్డును నిర్మిస్తున్న ప్రాంతానికి సంబంధం లేదని పేర్కొన్నారు.

English summary
China on July 5, 2017 accused India of “misleading the public” by saying that Chinese troops are building a road close to the “Chicken’s Neck” in the Sikkim sector which could endanger India’s access to the northeastern States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X