ట్రంప్ వ్యవహారంపై రంగంలో దిగిన ఐక్యరాజ్యసమితి..!!

వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంజా విసిరారు. వైమానిక దాడులతో విరుచుకుపడ్డారు. రాజధాని కారకాస్ పై బాంబులను కురిపించారు. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించారు. అక్రమ మాదక ద్రవ్యాలను తమ దేశంలోకి పంపిస్తోందనే ఆరోపణలపై అమెరికా ఈ సైనిక చర్యకు ఒడిగట్టింది. ఇదే అంశంపై మదురోను విచారించబోతున్నట్లు ప్రకటించింది. న్యూయార్క్ వేదికగా ఈ న్యాయ విచారణ కొనసాగుతుంది.

వెనిజులపై అమెరికా దాడి చేసిన అనంతరం పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. అమెరికా శత్రుదేశాలు ఏకం అయ్యాయి. లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాలన్నీ ఈ చర్యను ఖండించాయి. అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధం అయ్యాయి. కొలంబియా వంటి దేశాలు భగ్గుమంటోన్నాయి.

China and Russia Back Colombia as Security Council Plans Emergency Meeting on Venezuela

అటు ఐక్యరాజ్య సమితి సైతం రంగంలోకి దిగింది. ఈ దాడి అంశాన్ని చర్చించడానికి సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతమండలి అత్యవసరంగా సమావేశం కాబోతోంది. వెనిజులాపై అమెరికా చేపట్టిన సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ తలెత్తిన ఉద్రిక్తతల గురించి భద్రతమండలి చర్చించబోతోంది. ఇదే ప్రధాన అజెండా కూడా. వెనిజులాపై దాడి, ఆ తర్వాతి పరిణామాలపై చర్చించడానికి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కొలంబియా చేసిన అత్యవసర అభ్యర్థన మేరకు, భద్రత మండలి సభ్య దేశాలు చైనా, రష్యా మద్దతుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన దేశానికి "స్వీయ రక్షణ హక్కు" ఉందని వెనిజులా రాయబారి పేర్కొన్న తర్వాత ఈ సమావేశానికి ఐక్యరాజ్యసమితి ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తొలగించిన తర్వాత ఆ దేశాన్ని తాత్కాలికంగా అమెరికా నియంత్రిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనిజులా ప్రభుత్వం ఈ సైనిక చర్యలను అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా తీవ్రంగా ఖండించింది. ఈ ఆపరేషన్ల లక్ష్యం వనరుల ఆక్రమణ, పాలన మార్పు అని ఆరోపించింది. వెనిజులా తన జాతీయ రక్షణను పటిష్టం చేసి, అంతర్జాతీయ జోక్యాన్ని కోరింది. ఈ ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడానికి కొలంబియా కూడా అత్యవసర ఐరాస సమావేశాన్ని కోరింది. కరేబియన్‌లో అమెరికా సైనిక ఉనికి పెరిగిన అంశాన్ని కూడా చర్చించాలని పట్టుబట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+