చైనాలో భారీ భూకంపం, వంద మందికి పైగా మృతి, వేలాది మందికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: చైనాలోని సిచువాన్ ఫ్రావిన్సులో మంగళవారం రాత్రి బారీ భూకంపం సంభవించింది,. ఈ మేరకు చైనా భూకంప కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ భూకంపంలో సుమారు వంద మంది మరణించి ఉంటారని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వేలాదిమంది గాయపడ్డారు.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైనట్టు చెప్పింది. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిసింది.

 China earthquake: Quake of magnitude 7.0 strikes Sichuan Province

భూకంప ధాటికి ఇళ్ళు కూలిపోయినట్టు చైనా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. విపత్తు సంభవించిన ప్రాంతానికి చేరుకొన్న సహయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంప తీవ్రత కేంద్రానికి 25 కిలోమీటర్ల పరదిలో ఎక్కువగా ఉన్నట్టు ప్రకటించింది.

సిచూవాన్‌లోని మారుమూల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. లక్షా ముప్పైవేల ఇళ్ళు ధ్వంసమయ్యాయని ప్రాథమిక అంచనా ప్రకారం తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An earthquake measuring 6.5 in magnitude struck China’s Sichuan Province on Tuesday evening, according to earthquake-monitoring agency US Geological Survey. There are no reports of loss of life or major damage to property. The region is sparsely populated with mostly ethnic Tibetans, many of whom are nomadic herders.
Please Wait while comments are loading...