year ender 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇదే.. !
అమెరికా లాంటి దేశాలతో ఒడిదుడుకులు ఎదురైనా 2025 లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలిచింది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ నివేదిక స్పష్టం చేసింది. అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా 2025 లో 1 ట్రిలియన్ డాలర్ల రికార్డు ఎగుమతి మైలురాయిని అధిగమించింది. యూరోపియన్ యూనియన్(EU), ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు బలమైన ఎగుమతులు ఈ మేరకు చైనా ఆర్థిక ప్రగతికి తోడ్పడ్డాయి. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే చైనా అత్యధిక వాణిజ్య మిగులును నమోదు చేసింది.
బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. 2025 లో చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచినట్లు స్పష్టం చేసింది. చైనా 2025 లో 1 ట్రిలియన్ డాలర్ల రికార్డు ఎగుమతి మైలురాయిని అధిగమించినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక స్పష్టం చేసింది. అక్టోబర్ నెలలో ఊహించని పతనం తర్వాత నవంబరులో చైనా ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. ఇది 1 ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. చైనా నుంచి ఎగుమతులు 5.9 శాతం పెరిగాయి. దిగుమతులు సైతం 1.9 శాతం వృద్ధిని సాధించాయి. ఫలితంగా మొత్తం వాణిజ్య మిగులు 112 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో ఈ విషయంలో చైనా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అధిక సుంకాలు ఉన్నప్పటికీ బీజింగ్ ఈ విజయాన్ని సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అక్టోబర్‌లో చైనా ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్ తగిలింది. అమెరికాకు ఎగుమతులు 29 శాతం తగ్గిపోయాయి. ఇది వరుసగా ఎనిమిదో నెలలో ఎగుమతులు తగ్గిపోవడం ఆందోళన కలిగించింది. అయినప్పటికీ, యూరోపియన్ యూనియన్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్ లకు ఎగుమతులలో వృద్ధి ఈ క్షీణతను సమర్ధవంతంగా అధిగమించింది. 2025 ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టినప్పటికీ, ఏడాదిలో ఎక్కువ భాగం ఓవర్సీస్ షిప్ మెంట్ లు పెరుగుతూనే ఉన్నాయి.

ఎగుమతి వృద్ధిలో గణాంకాలు స్పష్టంగా కనబడ్డాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలకు ఎగుమతులు రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో పాటుగా.. యూరోపియన్ యూనియన్ కు అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ఇది 2022 తర్వాత అతిపెద్ద పెరుగుదల కావడం విశేషం. అదేవిధంగా, ఆఫ్రికాకు ఎగుమతులు దాదాపు 28 శాతం మేరకు పెరిగాయి. ఇక 10 దేశాల ఆగ్నేయాసియా వాణిజ్య కూటమికి అమ్మకాలు కేవలం 8.4 శాతం మాత్రమే పెరిగాయి.












Click it and Unblock the Notifications