భారీ మానవరహిత యుద్ధ హెలికాప్టర్‌ను అమ్మకానికి పెట్టిన చైనా

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: మానవరహిత యుద్ధ హెలికాప్టర్‌ను తొలిసారిగా చైనా ప్రదర్శనకు ఉంచింది. టియాంజిన్‌‌లో జరుగుతున్న హెలికాప్టర్‌ ఎక్స్‌పోలో ఈ మానవరహిత యుద్ధ హెలికాప్టర్‌ ఏవీ500డబ్యూను ఏవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా(ఏవీఐసీ) ప్రదర్శనకు ఉంచింది.

డొక్లాం భారత్‌కు అవసరం లేదుగా అంటున్నారు కానీ, యుద్ధం కాదు: చైనా

ఏవీఐసీ తన నాలుగో చైనా హెలికాప్టర్ ఎక్స్‌పోలో తొలిసారి ఈ భారీ హెలికాప్టర్‌ను ప్రదర్శనకు ఉంచింది. 7.2 మీటర్ల పొడవు ఉన్న ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను జియాంగ్సి ప్రావిన్స్‌లోని ఏవీఐసీకి చెందిన హెలికాప్టర్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేసింది.

ఇదీ దీని సామర్థ్యం

ఇదీ దీని సామర్థ్యం

ఇది గరిష్ఠంగా 450 కిలోల బరువు మోస్తూ గంటకు 170 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 120 కిలోల ఆయుధాలు, సామాగ్రిని రవాణా చేయగలదు. ఆకాశంలో 8గంటల పాటు ఎగురుతూ, నిఘా ఉంచగలదు.

యుద్ధం టైంలో 4 గంటలు ఎగరగలదు

యుద్ధం టైంలో 4 గంటలు ఎగరగలదు

యుద్ధం సమయంలో 4 గంటల పాటు నిర్విరామంగా ఎగిరే సామర్థ్యముంది. అంతర్జాతీయ మార్కెట్లోకి త్వరలోనే ఈ మానవరహిత యుద్ధ హెలికాప్టర్‌ను తీసుకొచ్చేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా ల్యాంట్, టేకాఫ్

ఎలాంటి పరిస్థితుల్లోనైనా ల్యాంట్, టేకాఫ్

ఎలాంటి కఠిన, ప్రతికూల ప్రదేశాల్లోనైనా ఈ హెలికాప్టర్‌ను ల్యాండ్‌/టేకాఫ్‌ చేయవచ్చునని, సరిహద్దులో పెట్రోలింగ్‌ నిర్వహించేందుకు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తిప్పికొట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

హెలికాప్టర్ కొనేందుకు..

హెలికాప్టర్ కొనేందుకు..

ఈ ఏడాది చివరి నాటికి దీన్ని విజయవంతంగా ప్రయోగించి, 2018 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసేందుకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
China has put on display its first unmanned combat helicopter AV500W for foreign buyers in the northeastern Tianjin city in a bid to enlarge scope to market its military drones abroad, a media report said on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X