వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా వింత వాదన: గత 70 ఏళ్లలో ఏ దేశానికి చెందిన ఇంఛ్ భూమినీ ఆక్రమించుకోలేదట

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్-చైనాల సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో డ్రాగన్ దేశపు అధికార ప్రతినిధి హూ చున్యింగ్ వింత వాదనలు తెరపైకి తెచ్చారు. గత 70 ఏళ్లలో చైనా ఇతర దేశాలకు చెందిన ఇంచ్ భూమిని కూడా ఆక్రమించలేదని వ్యాఖ్యానించారు. అంతేగాక, భారత పై ఆరోపణలు కూడా ఎక్కుపెట్టారు.

Recommended Video

#ChinaIndiaFaceOff : ఓ వైపు పాక్ ఉగ్రవాదులు .. మరో వైపు చైనా బలగాలు ! || Oneindia Telugu

వాస్తవాధీన రేఖను భారత బలగాలే దాటాయని చైనా ప్రతినిధి ఆరోపించారు. ప్యాంగ్ సరస్సు వద్ద భారత బలగాలు మోహరించాయని తెలిపారు. అయితే, తాము ఇరుదేశాల మధ్య శాంతినే కోరుకుంటున్నామని చెప్పారు. చైనా గత 70 ఏళ్లలో ఒక యుద్ధం కూడా చేయలేదని, ఏ దేశానికి చెందిన ఇంఛ్ భూమిని కూడా ఆక్రమించుకోలేదని పునరుద్ఘాటించారు.

china Has Not Occupied an Inch of Foreign Territory in 70 Years, Claims Chinese Spokesperson

వాస్తవాధీన రేఖను చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడూ దాటలేదని చున్యింగ్ చెప్పుకొచ్చారు. కాగా, ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద చైనా స్టేటస్ కో మార్పుకు పాల్పడిందని, భారీగా బలగాలను మోహరించిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలకు చెందిన బ్రిగేడియర్ స్థాయి అధికారులు సోమవారం, మంగళవారం కూడా సమావేశాలు నిర్వహించారు. చైనా అదే తప్పుడు వాదనలు చేయడం, వాస్తవాలను దాచేయడంతో ఈ సమావేశాలు అర్ధాంతరంగా ముగిశాయి. దీంతో సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు.
1962లో చైనాతో యుద్ధం జరిగిన నాటి నుంచి ఆ దేశం సరిహద్దులో ఎప్పుడూ ఏదో సమస్యను సృష్టిస్తూనే ఉంది.

ఓ వైపు పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపుతుంటే.. మరో వైపు చైనా తన బలగాలను పంపుతోంది. ఈ రెండు శత్రుదేశాలను కూడా భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. అంతేగాక, వాటికి ధీటుగా స్పందిస్తూ బుద్ధి చెబుతున్నాయి. గత జూన్ నుంచి చైనా సరిహద్దులో ఘర్షణలకు దిగుతోంది. దీంతో భారత్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. సరిహద్దులో రెండు దేశాల బలగాలు భారీగా చేరుకోవడంతో ఎప్పుడేం జరుగుతుందనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

English summary
Amid the ongoing border standoff between India and China, Beijing on Tuesday said it has never encroached upon foreign territory in the 70-odd years of new China's foundation as it again tried to blame New Delhi for the tensions in Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X