చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టిన పాకిస్తాన్: రాకెట్ ప్రయోగం

Pakistan Lunar Mission: చందమామపై పరిశోధనలకు సిద్ధపడింది పొరుగుదేశం పాకిస్తాన్. భారత్ తరహాలోనే మూన్ మిషన్ చేపట్టింది. విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించింది. ఈ తరహా అంతరిక్ష ప్రయోగాలు, చంద్రుడిపై పరిశోధనలకు పాకిస్తాన్ పూనుకోవడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే చంద్రుడిపైకి పేలోడ్స్‌ను విజయవంతంగా పంపంచగలిగింది.

ఈ ప్రయోగానికి దాని మిత్ర దేశం చైనా సహకరించింది. పాకిస్తాన్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీతో కలిసి ఈ పేలోడ్స్‌ను రూపొందించింది. ఈ ఉపగ్రహాన్ని చంద్రుడిపై మోసుకెళ్లడానికి అవసరమైన సహాకారాన్ని అందించింది.

China helps first Pakistan lunar mission

ఈ లూనార్ మిషన్‌కు ఐక్యూబ్- కమర్ అని పేరు పెట్టింది పాకిస్తాన్. పాక్ ఉపగ్రహం ఐక్యూబ్ క్యూ, చైనా శాటిలైట్ చాంగ్ ఇ-6 ప్రోబ్‌ను చంద్రుడిపైకి చేర్చడానికి లాంగ్ మార్చ్- 5 వై8 రాకెట్‌ను ఉపయోగించారు. చైనాలోని హైనన్ ఐలాండ్స్‌లో గల వెంఛెంగ్ స్సేస్ లాంచింగ్ సెంటర్ నుంచి ఆ దేశ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9: 27 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిందీ రాకెట్.

ప్రయోగించిన తేదీ నుంచి అయిదు రోజుల తరువాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది ఐక్యూబ్ కమర్ శాటిలైట్. అనంతరం చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అవుతుంది ఈ పేలోడ్. 48 గంటల పాటు తవ్వకాలు చేపడతుంది. అనంతరం రెండు కిలోగ్రాముల బరువు ఉండే చంద్రుడి ధూళి, మట్టి, శిలలను తీసుకుని మళ్లీ భూమికి తిరిగి వస్తుంది. మంగోలియాలో ఇవి ల్యాండ్ అయ్యేలా ప్రోగ్రామ్స్ రూపొందించారు.

China helps first Pakistan lunar mission

పాకిస్తాన్‌కు చెందిన ఐక్యూబ్ కమర్‌తో పాటు రాడాన్ డిటెక్టర్- ఫ్రాన్స్, లూనార్ సర్ఫేస్ నెగెటివ్ అయాన్ అనలైజర్- యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, లేజర్ యాంగిల్ రిఫ్లెక్టర్- ఇటలీ పేలోడ్స్‌ను కూడా లాంగ్ మార్చ్- 5 వై8 రాకెట్‌ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. వాటిని నిర్దేశిత ఆర్బిట్‌లోకి ప్రవేశపెడుతుంది.

ఇదివరకు భారత్- చంద్రయాన్ 3 పేరుతో చంద్రుడిపై పరిశోధనలను నిర్వహించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ ల్యాండ్ అయిన దక్షిణ ధృవం పైనే పాకిస్తాన్ కూడా కన్నేసింది. తన పేలోడ్ అక్కడే ల్యాండ్ చేయనుంది. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ప్రకటించింది.

China helps first Pakistan lunar mission

దీనిపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశ అంతరిక్ష ప్రయోగాలలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా విజయవంతంగా అడుగు పెట్టామంటూ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగాన్ని ఆయన టీవీ ద్వారా వీక్షించారు.

మున్ముందు మరిన్ని ప్రయోగాలు ఉండబోతోన్నాయని చెప్పారు. చైనా తమకు ఉన్న మిత్రత్వం.. హిమాలయాల కంటే అత్యున్నతమైనదని, సముద్రాల కంటే లోతైనదని, తేనె కంటే తియ్యనైనదని పేర్కొన్నారాయన. పాకిస్తాన్-చైనా సంయుక్తంగా అంతరిక్షంలో ఘన విజయాలను సాధిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+