Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కండోమ్‌లపై టాక్స్.. నిన్నటి నుంచే అమలులోకి వచ్చిన కొత్త రూల్

జనన రేటును పెంచే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాంట్రాసెప్టివ్ ఉత్పత్తులపై పన్ను విధించేసింది. వీటిని కూడా సాధారణ వినియోగ వస్తువుల కేటగిరీలోకి తీసుకొచ్చి 13 శాతం వ్యాట్ (VAT) వర్తింపజేశారు. వీటితో పాటుగానే పిల్లల పెంపకానికి సబ్సిడీలు, చైల్డ్‌కేర్ సేవలపై పన్ను రాయితీలు, వివాహ ప్రోత్సాహక పథకాలు అమల్లోకి తెచ్చింది. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అమలలోకి ఈ విధానాన్ని ఎందుకు తీసుకువచ్చింది. ఈ నిర్ణయం ఏ దేశానికి చెందినది?

ఒకప్పుడు కఠినమైన ఒకే సంతానం విధానం అమలు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన చైనా.. ఇప్పుడు పూర్తిగా భిన్న పరిస్థితిని ఎదుర్కొంటోంది. జనాభా తగ్గుదలతో వృద్ధుల సంఖ్య పెరగడం, కార్మిక లోటు వంటి సమస్యలు భవిష్యత్తులో తీవ్రమయ్యే అవకాశం భారీగా ఉంది. చైనా ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం. అయితే ఇంత మంది జనాభా ఉన్నా కూడా.. వారి దేశంలో అసలు జనమే లేరన్నట్లుగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఈ దేశం. అందుకే చైనా ప్రభుత్వం కీలక విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ఇకపై పన్ను మినహాయింపులో ఉండవు..

దేశంలో తీవ్రమవుతున్న జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొనేందుకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, ఇతర కాంట్రాసెప్టివ్ ఉత్పత్తులపై పన్ను విధిస్తూ జనవరి 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ నిర్ణయంతో ఈ ఉత్పత్తులు ఇకపై పన్ను మినహాయింపులో ఉండవు. ఇప్పటివరకు చైనాలో గర్భనిరోధక ఉత్పత్తులకు ప్రత్యేక మినహాయింపులు ఉండేవి. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ వస్తువులు పన్ను పరిధి వెలుపలే కొనసాగాయి. అయితే తాజా నిర్ణయంతో వాటిపై 13 శాతం వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) విధించడంతో ధరలు పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

China Imposes Tax on Condoms and Contraceptives to Increase Birth Rate

పిల్లల పెంపకానికి సబ్సిడీలు..

ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చైనాలో పడిపోతున్న జనన రేటే అని ప్రభుత్వం పేర్కొంది. అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాది జననాల సంఖ్య చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరింది. యువత పెళ్లి, పిల్లల విషయంలో వెనకడుగు వేయడం, జీవన వ్యయాలు పెరగడం వంటి అంశాలు దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. పిల్లల పెంపకానికి సబ్సిడీలు, చైల్డ్‌కేర్ సేవలపై పన్ను రాయితీలు, వివాహ ప్రోత్సాహక పథకాలు అమల్లోకి తెచ్చింది. తాజా కండోమ్ పన్ను కూడా ఈ సమగ్ర జనాభా విధానంలో భాగమేనని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి.

కండోమ్‌ల ధరలు పెరగడం వల్ల..

అయితే ఈ నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు విశ్లేషకులు కండోమ్‌ల ధరలు పెరిగినా పిల్లలు కవాలనే నిర్ణయంపై పెద్దగా ప్రభావం ఉండదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది వ్యక్తిగత ఎంపికలపై ప్రభుత్వ జోక్యంగా భావిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య నిపుణులు కూడా ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కండోమ్‌ల ధరలు పెరగడం వల్ల వాటి వినియోగం తగ్గితే అనుకోని గర్భధారణలు, లైంగిక వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా యువత, తక్కువ ఆదాయ వర్గాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కండోమ్‌లపై పన్ను విధింపు వంటి చర్యలు జనన రేటుపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. దీని ఫలితాలు రానున్న నెలల్లో స్పష్టమవుతాయని, అప్పటివరకు ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+