వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో వ్యక్తిని చంపిన సింహం: కాల్చి చంపిన జూ సిబ్బంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాలో జూ సిబ్బంది సింహాన్ని కాల్చి చంపారు. ఈ ఘటన ఆదివారం ఉదయం షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ఉన్న తైయాన్‌ టైగర్‌ మౌంటెయిన్‌ పార్కు జూలో చోటు చేసుకుంది. జూ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

సింహం ఎన్ క్లోజర్‌లోకి శుభ్రం చేయడానికి వచ్చిన 65 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి అతని మెడ, గొంతు భాగాలను తినిసేంది. దీంతో తీవ్ర గాయాలతో మరణించాడు. ఆ తర్వాత ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది.

దీంతో అప్రత్తమైన జూ అధికారులు పార్కులోని చెరువులో ఉదయం పూట స్నానం చేయడానికి వచ్చే జూ సిబ్బందిని, ఇతర పర్యాటకులను బయటకు పంపిచేశారు. సింహం తప్పించుకున్న గంట సేపటి వరకు దాన్ని పట్టుకోలేకపోయారు.

China lion shot after killing man in zoo and escaping

సింహాన్ని పట్టుకునేందుకు గాను పార్కు లోపలా, బయటా స్పెషల్ ఫోర్సుని రంగంలోకి దించినట్లు స్ధానిక మీడియా పేర్కొంది. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సింహాన్ని గన్‌తో కాల్చినట్లు జూ అధికారులు తెలిపారు.

ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సింహాన్ని గన్‌తో కాల్పిచంపారు. ఆ తర్వాత 10 నిమిషాల పాటు వరుసగా గాల్లోకి కాల్పులు జరిపారు. సింహాన్ని జూ సిబ్బంది కాల్చి చంపిన వార్త చైనా సోషల్ మైక్రో బ్లాగింగ్ నెట్ వర్క్ వైబోలో మూడో స్ధానంలో ఉందట.

ఇది ఇలా ఉంటే జంతు పరిరక్షణ సంఘాలు మాత్రం సింహాన్ని చంపడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

English summary
A lion in a Chinese zoo was shot dead after it killed one of its keepers and escaped its enclosure. The incident took place on Sunday in the eastern province of Shandong, at the Taian Tiger Mountain Park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X