Indo-Pak War: మధ్యవర్తిత్వానికి రెడీ- మరోసారి చైనా ఆఫర్..!
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. పాకిస్తాన్ ను సరిహద్జులు దాటి భారత సేనలు నియంత్రిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఇవాళ కౌంటర్ ఆపరేషన్ బున్యన్ ఉల్ మర్సూస్ ను చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం కోసం అంతర్జాతీయంగా పలు దేశాలు ముందుకొస్తున్నాయి. వీటిలో ఇరాన్, చైనా కూడా ఉన్నాయి.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న తరుణంలో మరోసారి చైనా మధ్యవర్తిత్వం కోసం ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరుదేశాలకు ప్రతిపాదనలు చేసింది. ఇరుదేశాల మధ్య సంక్షోభంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ తెలిపింది. ఈ ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

శాంతి, స్థిరత్వం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం పనిచేయాలని ప్రశాంతత, సంయమనం పాటించాలని, శాంతియుత మార్గాల ద్వారా రాజకీయ పరిష్కారానికి తిరిగి రావాలని, ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యల నుండి దూరంగా ఉండాలని భారత్, పాకిస్తాన్ ను చైనా కోరింది. భారతదేశం, పాకిస్తాన్ రెండింటి ప్రాథమిక ప్రయోజనాలకు, స్థిరమైన, శాంతియుత ప్రాంతానికి ఇది ముఖ్యమైనదని వెల్లడించింది. అంతర్జాతీయ సమాజం కూడా దీనినే చూడాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ లక్ష్యంతో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు.
ఇప్పటికే ఓసారి చైనా మధ్యవర్తిత్వం ఆఫర్ చేసినా భారత్-పాక్ మాత్రం స్పందించలేదు. అలాగే అమెరికా కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ప్రతి రోజూ ఇరుదేశాలను కోరుతూనే ఉంది. అయినా పరిస్దితిలో ఎలాంటి మార్పూ లేదు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టి జవాబు ఇస్తూనే ఉంది. అటు ఇరాన్ కూడా ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు అందరి కంటే ముందుగానే ఆఫర్ చేసింది. దీన్నీ ఇరుదేశాలూ పట్టించుకోలేదు.












Click it and Unblock the Notifications