ఉ.కొరియాకు షాక్: శరణార్థులకు చెక్, సరిహద్దు వెంట కఠినంగా చైనా
చైనా-ఉత్తరకొరియా సరిహద్దులో ఇప్పటికే బలమైన కంచె నిర్మాణం పూర్తయిపోయిందని అంతర్జాతీయ మీడియా సైతం ద్రువీకరించింది.
వాషింగ్టన్: నిన్న మొన్నటిదాకా పొరుగు దేశం ఉత్తరకొరియాతో కొనసాగించిన మిత్ర సంబంధాలన్నింటిని చైనా తెంచేసుకుంటోంది. తొలుత మొండిగా ఉత్తరకొరియాకే మద్దతు పలికినా.. ఆ దేశంతో తమకూ ముప్పు పొంచి ఉందన్న నిజాన్ని చైనా గ్రహించింది.
ఈ మేరకు ఐరాస విధించిన ఆంక్షలకు చైనా పూర్తి సహకారం అందిస్తోంది. ఇప్పటికే ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలను తెంచేసుకున్న చైనా.. ఆ దేశ శరణార్థులను కూడా అనుమతించడం లేదు. సరిహద్దులో చెక్ పాయింట్లు ఏర్పాటు శరణార్థుల వలసలను అడ్డుకుంటోంది.

చైనా-ఉత్తరకొరియా సరిహద్దులో ఇప్పటికే బలమైన కంచె నిర్మాణం పూర్తయిపోయిందని అంతర్జాతీయ మీడియా సైతం ద్రువీకరించింది. గతంలో ఇక్కడ చైనా సైనికుల పహారా ఉండేది కాదని, ఇప్పుడు పహారా కొనసాగుతోందని తెలిపింది.
గతంలో ఉత్తరకొరియాకు అన్నివిధాల సహకరించి, శరణార్థులకు కూడా ఆశ్రయమిచ్చిన మాట వాస్తవమేనని కానీ అదంతా గతమని గుర్తుచేసింది. ఇప్పటికే అధిక జనాభాతో సతమతమవుతున్నామని, అందుకే ఉ.కొరియా శరణార్థులను అనుమతించడం లేదని చైనా స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications