Monkey B Virus: ఆ డేంజరస్ వైరస్‌కు వెటరినరీ డాక్టర్ బలి: తొలి మరణం..అదీ చైనాలోనే

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ మహమ్మారికి జన్మనిచ్చినట్టుగా అనుమానిస్తోన్న చైనా.. మరో ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడుతోంది. కొద్దిరోజుల కిందటే వెలుగులోకి వచ్చిన మంకీ బీ వైరస్ (Monkey B Virus) తొలి మరణం అక్కడ నమోదైంది. మంకీ బీ వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన దేశాలన్నింటి కంటే తొలి మరణం ఇదే. ఈ విషయాన్ని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) జర్నల్ నిర్ధారించింది. మంకీ బీ వైరస్ వల్ల ఓ వెటరినరీ డాక్టర్ మృతి చెందినట్లు ధృవీకరించింది.

కోతుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్ ఇది. ఈ వైరస్‌ సోకిన తరువాత తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ 57 సంవత్సరాల పశువైద్యుడు మరణించినట్లు సీడీసీ తెలిపింది. ఆయన సన్నిహితులు గానీ, కుటుంబ సభ్యులు గానీ ఈ వైరస్ ఎలాంటి లక్షణాలు లేవని.. వారందరూ సురక్షితంగానే ఉన్నట్లు సీడీసీని ఉటంకిస్తూ- చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. బీజింగ్‌కు చెందిన పశువైద్యుడు.. తన వృత్తిలో భాగంగా పరిశోధనల కోసం ఈ ఏడాది మార్చిలో రెండు కోతుల కళేబరాలను ముక్కలు చేశాడు.

 China reported its first human infection with Monkey B Virus and subsequent first death

ఆ కొద్దిరోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే.. ఆయన ఆరోగ్యం విషమించింది. మే 27వ తేదీన ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని పరీక్షించగా మంకీ బీ వైరస్‌ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పటిదాకా చైనాలో మంకీ బీ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి ఆయనేనని సీడీసీ వీక్లీ జర్నల్ ప్రకటించింది. చైనాలో ఇంతకుముందు ఎన్నడూ ఈ వైరస్‌ సోకిన దాఖలాలు లేవని.. ఇదే తొలి కేసుగా పేర్కొంది.

Recommended Video

    Green Fungus Symptoms ముక్కు నుంచి రక్తం , తీవ్ర జ్వరం | Prevention | Black Fungus | Oneindia Telugu

    బీవీ గా పిలిచే మంకీ బీ వైరస్‌ను తొలిసారిగా మకాక్స్‌ అనే కోతి జాతిలో గుర్తించారు. 1932లోనే ఈ వైరస్ వ్యాప్తిలోకి వచ్చినట్లు తేల్చారు. ఇది కోతుల నుంచి నేరుగా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి మరణించడానికి 80 శాతం వరకు అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన డ్రాగన్ కంట్రీలో మరో వైరస్ ఇప్పుడిప్పుడే ప్రాణాలను తీసే స్థాయికి చేరడంతో చైనా అప్రమత్తమైంది. దాన్ని నివారించడానికి తక్షణ చర్యలను తీసుకుంటున్నామని సీడీసీ తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+