పాకిస్థాన్ అత్యాధునిక యుద్ధ విమానం రెడీ..! భారత్ కు బిగ్ షాక్..!
పాకిస్థాన్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ లో ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కూడా పాకిస్థాన్ తన JF-17 PFX యుద్ధ విమానం తయారీలో మాత్రం వేగం పెంచుతూనే ఉంది. 2028 నాటికి పాకిస్థాన్ ఈ యుద్ధ విమానాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు భారత్ తేజస్ యుద్ధ విమానాల తయారీలో జాప్యం జరుగుతోంది.
భారత్- పాకిస్థాన్ మధ్య నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఓ వైపు భారత్ ఏటా తన రక్షణ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసుకుంటూ వెళ్తోంది. ఆ మేరకు రక్షణ రంగ వ్యయం గత పదేళ్లలో భారీగా పెరిగింది. ఈ క్రమంలో భారత్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ సైతం అప్పు చేసి మరీ తన ఆయుధ సామాగ్రిని పెంచుకుంటోంది. ఈ మేరకు పాకిస్థాన్ అభివృద్ధి చేస్తున్న JF-17 PFX యుద్ధ విమానం 2028 నాటికి సిద్ధం కానుంది. ఇది 4.5 జనరేషన్ యుద్ధ విమానం.. అలాగే అత్యాధునిక ఏసా రాడార్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలు, ఇన్ ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ వ్యవస్థలను ఈ యుద్ధ విమానం కలిగి ఉంది. అలాగే చైనాకు చెందిన PL-15 క్షిపణులను సైతం ఈ ఫైటర్ జెట్స్ కు అమర్చనున్నారు. ఇది ఏరియల్ ఫైట్ లో పాకిస్థాన్ కు పై చేయిని ఇవ్వగలదని భావిస్తున్నారు.

మరోవైపు భారత్ కు చెందిన తేజస్ Mk1A యుద్ధ విమానం తయారీలో జాప్యం జరుగుతూనే ఉంది. అమెరికాకు చెందిన GE F404 ఇంజిన్ల సరఫరాలో జరుగుతున్న ఆలస్యం కారణంగా భారత్ తేజస్ ప్రోగ్రాంలో ఆలస్యం జరుగుతోంది. భారత్ దాదాపు 180 తేజస్ Mk1A యుద్ధ విమానాలను ఆర్డర్ ఇచ్చింది. అయితే వీటి ఉత్పత్తిలో మాత్రం జాప్యం జరుగుతోంది. మరోవైపు తేజస్ ప్రాజెక్ట్ లో భారత్ స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇదే సమయంలో పాకిస్థాన్.. చైనా టెక్నాలజీని వినియోగించుకుని వేగంగా కొత్త వెర్షన్లను అందుబాటులోకి తెస్తోంది. 2028 నాటికి పాకిస్థాన్ PFX యుద్ధ విమానం రెడీ అయిపోయి.. అలాగే భారత్ తేజస్ ఫైటర్ జెట్స్ లో ఆలస్యం అయితే ఇండో- పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ఆందోళనలు పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications