అంతరిక్షం నుంచి దూసుకొస్తోన్న చైనా స్పేస్ స్టేషన్! దేవుడా.. ఎక్కడ పడుతుందో? ఏం జరుగుతుందో?

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: ఆకాశంలోకి ఉమ్మితే అదొచ్చి మన మొహంపైనే పడుతుందట. ఇప్పుడలాగే ఉంది పరిస్థితి చూస్తుంటే. అంతరిక్షం అంతు చూద్దామనుకుంటూ ఎడాపెడా ఉపగ్రహాలు పైకి పంపుతుంటే.. వాటిలో కొన్ని తిరిగి మన నెత్తినే పడడానికి వస్తున్నాయి.

ప్రపంచం నెత్తిన మరో 'స్కైలాబ్‌'!? ఇది మనం ప్రయోగించిందే, 40 రోజులే గడువు, తీవ్ర ఉత్కంఠ!

విషయం ఏమిటంటే.. అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందన్న విషయం తెలిసిందే కదా! అలాగే చైనా వాళ్లు అమెరికా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో సంబంధం లేకుండా అంతరిక్షంలో 'తియాన్‌గాంగ్-1' పేరుతో ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడది అదుపుతప్పిందట. శరవేగంగా భూమి వైపు దూసుకొస్తోంది.. అదీ సంగతి!

అసలే భయపడి చస్తుంటే..

అసలే భయపడి చస్తుంటే..

అసలే ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1హెచ్‌ ఉపగ్రహం విఫలమై భూమికి తిరిగొస్తోందని, అది మరో స్కైలాబ్‌గా మారనుందని ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు పులిమీద పుట్రలా మరో వార్త.. చైనా స్పేస్ స్టేషన్ పరిస్థితి కూడా అంతేనని. అదీ తిరిగి భూమివైపు దూసుకొస్తోందని చెబుతున్నారు. ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1హెచ్‌ ఉపగ్రహం మరో నలభై నుంచి యాభై రోజుల్లో భూమిపై పడనుందని సెప్టెంబరు మొదటి వారంలో శాస్త్రవేత్తలు ప్రకటించిన దగ్గర్నించి అందరూ భయపడి చస్తున్నారు.. వచ్చీ వచ్చీ అదెక్కడ కూలుతుందో, ఆపైన ఏం జరుగుతుందో అని.

మూడు మహానగరాలకు పెనుముప్పు

మూడు మహానగరాలకు పెనుముప్పు

ఇప్పుడు అంతరిక్షంలోని చైనా స్పేస్ స్టేషన్ ‘తియాన్‌గాంగ్-1' పరిస్థితీ ఇలాగే ఉంది. అదుపు తప్పిన ఈ స్పేస్ స్టేషన్ భూమి వైపు దూసుకొస్తోందని.. దీని వల్ల మూడు మహానగరాలకు పెనుముప్పు పొంచి ఉందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. గతంలో అంతరిక్షంలో చైనా ప్రవేశపెట్టిన స్పేస్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది. దీని బరువు 8.5 టన్నులని చైనా పేర్కొంది. అయితే అంతరిక్షంలో ప్రస్తుతం ఇది ఎక్కడుంది? ఎప్పుడు.. ఎక్కడ కూలుతుంది? ఇలాంటి ప్రశ్నలేమీ అడగొద్దని చైనా శాస్త్రవేత్తలు చావుకబురు చల్లగా చెప్పారు. ఎందుకంటే వారికే తెలియదట. ఇక మనకేం చెబుతారు?

 ఆ మూడు మహానగరాల్లోనేనా?

ఆ మూడు మహానగరాల్లోనేనా?

మరోవైపు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మాత్రం ఈ చైనా స్పేస్ స్టేషన్ భూమిపై ఎక్కడ పడవచ్చనే దానిపై అంచనా వేస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌, చైనాలోని బీజింగ్‌, జపాన్‌ లోని టోక్యో నగరాల్లో కూలే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. కచ్చితంగా ఈ మూడు మహానగరాల్లోనే ఏదో ఒకదాంట్లో కూలుతుందా? అంటే.. మరీ అంత కచ్చితంగా చెప్పలేమంటున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. లాస్‌ ఏంజెలిస్‌, ఇస్తాంబుల్‌, రోమ్‌ లకు కూడా ప్రమాదం పొంచివుందని, ఆ నగరాలు కాకపోతే ఈ నగరాలపై కూలవచ్చని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇదెప్పుడు భూమిపై కూలుతుందంటే.. వచ్చే రెండు మూడు నెలల్లో ఎప్పుడైనా కూలవచ్చని చెబుతున్నారు.

రెండు గంటల ముందు మాత్రమే...

రెండు గంటల ముందు మాత్రమే...

చైనా విఫల స్పేస్ స్టేషన్ ‘తియాన్‌గాంగ్-1' కచ్చితంగా భూమిపై ఎక్కడ కూలుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ... సదరు స్పేస్ స్టేషన్ భూ వాతావరణంలో ప్రవేశించడానికి రెండు గంటల ముందు మాత్రం చెప్పగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం రెండు గంటల ముందు మాత్రమే చెబితే మాత్రం ప్రయోజనం పెద్దగా ఏముంటుంది? ఆ రెండు గంటల్లో భారీ స్థాయిలో నష్టనివారణ చర్యలు తీసుకోగలమా? తీసుకోలేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. ఏఏ నగరాలు ధ్వంసమవుతాయి? ఎంత మంది ప్రజల ప్రాణాలు పోతాయి? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The European Space Agency has issued warnings that China’s space station Tiangong-1 may crash in major cities. According to the agency, cities that are under threat include New York in the United States of America (USA), Beijing in China and Tokyo in Japan. The space station Tiangong-1 may fall in the beginning months of the coming year. The Chinese Space Agency has informed the United Nations that they have lost control over the 8.5-ton weighty space station. About the space station crashing in one of the major cities, it is reported that it may fall between two latitude lines in Northern Hemisphere and Southern Hemisphere. While the experts have said that they are not clear about the space station’s location and falling place, they have revealed that the cities under threat include New York, Los Angeles, Beijing, Rome, Istanbul, and Tokyo. They had earlier said that they could guess the place two hours before it falls on the Earth.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి