కొరియా ‘నిప్పు’ ఆర్పేందుకు.. రష్యా సాయం కోరిన చైనా

ఉత్తర కొరియా తన దుందుడుకు అణ్వస్త్ర ప్రయోగాలతో తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న నేపథ్యంలో.. ఈ ఉద్రిక్తతలు సడలించేందుకు సాయం చేయాలంటూ రష్యాను కోరింది చైనా.

బీజింగ్‌: ఉత్తర కొరియా రాజేసిన 'అణు' నిప్పును చల్లార్చేందుకు రష్యా సాయం కోరింది చైనా. ఉత్తర కొరియా తన దుందుడుకు అణ్వస్త్ర ప్రయోగాలతో తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న నేపథ్యంలో.. ఈ ఉద్రిక్తతలు సడలించేందుకు సాయం చేయాలంటూ రష్యాను కోరింది.

అంతర్జాతీయ ఆంక్షలు, ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా దూకుడుగా అణ్వాయుధ ప్రయోగాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్యలతో పుండు మీద కారం చల్లినట్టు మండిపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.

China seeks Russia’s help to ‘cool’ tensions over North Korea’s nuclear ambitions

ఈ నేపథ్యంలో ఇప్పటికే కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ తమ దేశ నావికా దళాన్ని మోహరించారు. కొరియా బెదిరింపులను దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ఏదైనా రెచ్చగొట్టే చర్యలకు దిగితే.. కనికరంలేకుండా బదులిస్తామంటూ హెచ్చరిక చేసింది.

ఉత్తర కొరియాకు ఏకైక మిత్రదేశం, ఆర్థిక ప్రాణాధారం అయిన చైనా ఈ ఉద్రిక్తతలతో ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా యుద్ధం జరగవచ్చునని ఆ దేశం శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌తో శుక్రవారం చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి భేటీ అయ్యారు.

కొరియా విషయంలో అన్ని పక్షాలను చర్చలకు ఆహ్వానించి ఉద్రిక్తతలను తగ్గుముఖం పట్టించడమే ఇరుదేశాల ధ్యేయమని చైనా ప్రకటించింది. ఈ విషయంలో రష్యా సాయాన్ని చైనా కోరినట్టు ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+