పాకిస్తాన్‌ను చైనా ఒప్పించగలదు: వైట్ హౌస్ అధికారి

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఉగ్రవాదులపై పోరుకు పాకిస్థాన్‌ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా - పాక్ దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు పాకిస్తాన్‌ను చైనా ఒప్పించగలదని వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పారు.

పాకిస్థాన్‌, చైనాకు మధ్య గత కొన్నేళ్లుగా చరిత్రాత్మక సత్సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా ఆ దేశ సైనికులతో కూడా మెరుగైన సంబంధాలను చైనా కలిగి ఉందని, వీటితో పాటు చైనా పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌‌తో ఆ రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాద సమస్యపై అమెరికా ఆందోళనను చైనా అర్థం చేసుకోగలదని, అందుకే పాకిస్తాన్‌తో ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆ దేశం కీలక పాత్ర పోషించగలదని, ఆప్ఘనిస్తాన్ - పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడేలా చేయడంలోను సహాయం చేయగలదని అన్నారు. అటు ఆప్గనిస్తాన్‌తోను చైనా సంబంధాలను కలిగి ఉందని, అందుకే ఇరు దేశాలతో మాట్లాడి ఉగ్రవాదులపై పోరాటానికి చైనా ఒప్పించగలుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
China could play a "helpful role" in convincing Pakistan that it is in its national interest to crackdown on terror safe havens, a senior White House official has said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి