వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటపడ్డ డ్రాగన్ బుద్ధి: మసూద్‌ అజార్‌ను మళ్లీ వెనకేసుకొచ్చిన చైనా

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి: అనుకున్నదే జరిగింది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని ఓ వైపు కల్లబొల్లి కబుర్లు చెప్పిన చైనా తెరవెనుక మాత్రం జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను వెనకేసుకొచ్చింది. మసూద్ అజార్‌ను ఉగ్రవాదులు జాబితాలో చేర్చి అతనిపై ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌లు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందు తీసుకొచ్చిన ప్రతిపాదనను చైనా మద్దతు తెలపలేదు. పాకిస్తాన్, ఉగ్రవాది మసూద్ అజార్ పట్ల తన మెతకవైఖరిని మరోసారి బయటపెట్టింది డ్రాగన్ కంట్రీ. దీంతో 2009 నుంచి మసూద్ అజార్‌ను బ్లాక్ లిస్ట్ చేయాలనే ప్రతిపాదనను చైనా అడ్డుకోవడం ఇది నాల్గవ సారి కావడం విశేషం.

బయటపడిన చైనా కుటిల బుద్ధి

బయటపడిన చైనా కుటిల బుద్ధి

మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ఇతర ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాలు ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ చైనా కుటిల బుద్ధి ముందు నిలవలేకపోయింది. ఇలా చైనా మసూద్ అజార్‌కు వంత పాడటం వరుసగా నాల్గవసారి. ఈ సారి కూడా చైనా సాంకేతిక కారణాలు చూపుతూ ప్రతిపాదనపై ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చేందుకు మరింత సమయం కావాలని పేర్కొంది డ్రాగన్ కంట్రీ.

 చైనా తీరు నిరాశకు గురిచేసింది..అయినా ప్రయత్నాలు కొనసాగిస్తాం: భారత్

చైనా తీరు నిరాశకు గురిచేసింది..అయినా ప్రయత్నాలు కొనసాగిస్తాం: భారత్


ఇక మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించాలని భారత్ చేసిన ప్రయత్నాలను చైనా నీరుగార్చింది. ప్రపంచదేశాలు అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా చూస్తున్న నేపథ్యంలో చైనా ఒక్కటే ఎందుకు ఆయన్ను వెనకేసుకొస్తుందో అర్థం కావడంలేదని చైనా తీరు నిరాశకు గురిచేసిందని భారత్ వెల్లడించింది. నలభై మంది జవాన్ల ప్రాణాలను తీసి కళ్లముందు రుజువులు కనిపిస్తున్నప్పటికీ చైనా ఇంకా సాకులు చూపడం తగదని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అడ్డుపడినప్పటికీ తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని భారత్ వెల్లడించింది.

చైనాకు అమెరికా హెచ్చరిక: ఈసారి మసూద్‌కు మద్దతు ఇస్తే ఖబడ్దార్..!చైనాకు అమెరికా హెచ్చరిక: ఈసారి మసూద్‌కు మద్దతు ఇస్తే ఖబడ్దార్..!

అమెరికా ఏం చేయబోతోంది..?

అమెరికా ఏం చేయబోతోంది..?

ఇక గత కొద్దిరోజుల ముందునుంచే చైనా మసూద్ అజార్‌ను వెనకేసుకొస్తున్నట్లుగా స్టేట్‌మెంట్స్ ఇస్తూ వచ్చింది. ఒకరోజు చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పింది. మరో రోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనల మేరకే చైనా నడుచుకుంటుందని వెల్లడించింది. ఇలా రోజుకో మాట చెబుతూ మసూద్ అజార్‌ను పరోక్షంగా వెనకేసుకొచ్చిన చైనా.... తాజాగా ఈ ఉగ్రవాదిని వెనకేసుకొచ్చి మరోసారి విమర్శల పాలైంది.

ఇక చైనా మసూద్ అజార్ విషయంలో అడ్డువస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని అమెరికా ఇదివరకే హెచ్చరించింది. మరి డ్రాగన్ కంట్రీతో ఇప్పటికే అమెరికా వాణిజ్య యుద్ధానికి దిగింది. ఇక మసూద్‌ అజార్‌ను వెనకేసుకురావడంతో అగ్రరాజ్యం చైనాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రపంచ ఎదురు చూస్తోంది. చైనా కూడా అమెరికాతో సై అంటే సై అనేలా కనిపిస్తోంది. మసూద్ అజార్ ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌ను నడుపుతున్నారని ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలని చైనాను సూటిగా ప్రశ్నించారు అమెరికా విదేశాంగా ప్రతినిధి రాబర్ట్ పాలాడినో. మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు పాలడినో.

English summary
India’s bid to get Pakistan-based Jaish-e-Mohammed's chief Masood Azhar as a "global terrorist" by the UN Security Council was once again blocked by China as it placed a “technical” hold on the resolution on Wednesday. This is the fourth time that China has blocked the resolution against Azhar since 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X