ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది సజీవదహనం!
చైనాలోని ఈశాన్య తీరప్రాంతంలో ఉన్న ప్రముఖ షిప్పింగ్ హబ్ చింగ్దాఓ ఓడరేవులో నిలిపి ఉంచిన కార్గో నౌకలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది సజీవదహనం కాగా.. మరో ఐదుగురి ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
చైనా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన ఓడను 'ఓషన్ మెలొడీ'గా గుర్తించారు. ఈ కార్గో నౌక లైబీరియా జెండాతో రాకపోకలు సాగిస్తోంది. ఈ నౌక చింగ్దాఓ ఓడరేవులోని 'బేహాయ్ షిప్ బిల్డింగ్' కంపెనీ వద్ద మరమ్మతుల కోసం డ్యాక్ చేయబడింది. అదే సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది.

నౌకలో ఉన్న 42 మంది
ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 42 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన రెస్క్యూ బృందాలు 12 మందిని సురక్షితంగా బయటకు తీశాయి. గురువారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు మంటలను నియంత్రణలో తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
రంగంలోకి దిగిన చైనా యంత్రాంగం-షీ జిన్‌పింగ్ ఆదేశాలు
ఈ ఘోర ప్రమాదంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన ఐదుగురిని వేగంగా వెతికి రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు, అగ్నిప్రమాదం సంభవించిన పరిస్థితులపై దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశించారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
🚨🇨🇳 #BREAKING: At least 20 people died and five are missing after a fire broke out on a cargo ship at the Qingdao shipyard in eastern China.
— Newslive 24x7 🅧︎ (@kanpurtak) September 10, 2026
The foreign cargo ship had arrived at the Qingdao shipyard for repairs. #China 🇨🇳 #CargoShip #QingdaoShipyard pic.twitter.com/ST9IdoPoUB














Click it and Unblock the Notifications
