మ్యానుఫ్యాక్చ‌రింగ్‌లో దూసుకెళ్తున్న ఇండియా: పట్టించుకోవద్దంటూ చైనా మీడియా!..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓవైపు భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుంటే.. మరోవైపు అక్కడి మీడియా భారత్ ను పరోక్షంగా టార్గెట్ చేసింది. తాజాగా భారత తయారీ రంగంపై చైనా తన అక్కసు ప్రదర్శించింది.

చైనా దుస్సాహసం: భారత బోర్డర్ సమీపంలో యుద్ధ సన్నాహాలు, లైవ్ ఫైర్ డ్రిల్స్

చైనాకు ధీటుగా భారత్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో అభివృద్ధి చెందుతుంద‌ని చెబుతూనే.. దాన్ని అంతలా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చైనీస్ అధికార ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ గమనార్హం. భారత్ అభివృద్ధిని పక్కనపెట్టి చైనా మ‌రింత మెరుగైన వృద్ధి వ్యూహంపై దృష్టి సారించాల‌ని, అలా అయితేనే ఆ దేశ వృద్ధి రేటుతో పోటీ పడగలమని చెప్పుకొచ్చింది.

China Should 'Keep Calm' About India's Rise: Chinese Media

భారత్‌లో ప్రవహిస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రవాహమే ఇక్కడి తయారీ రంగ విస్తృతికి కారణమని పేర్కొంది.
గ‌తంలో ఇండియాకు స‌రైన పెట్టుబ‌డులు, అభివృద్ధి చెందిన నిర్మాణ రంగం, వృత్తి నిపుణులు లేక ఇబ్బంది ప‌డింద‌ని గుర్తుచేసింది. విదేశీ పెట్టుబడుల రాక భారత తయారీ రంగాన్ని పటిష్టం చేసిందని, ఒకవిధంగా భారత బలహీనతలకు పరిష్కారం దొరికిందని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది.

చైనాలో రెండు దశాబ్దాల క్రితం ఏం జరిగిందో.. ఇప్పుడదే ఇండియాలోను జరుగుతోందని చెప్పుకొచ్చింది. పెద్ద ఎత్తున తయారీ రంగ సంస్థల ఏర్పాటుతో మానవ నైపుణ్యం కూడా పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టిన కంపెనీల పేర్లను కూడా చైనా మీడియా వెల్లడించింది. ఇలాంటి తరుణంలో.. నిశ్శబ్దంగా ఇండియా ఎదుగుదలను గమనిస్తూనే ప్రభావవంతమైన వ్యూహలను అమలు చేయాలని గ్లోబల్ టైమ్స్ ఆ దేశ నిపుణులకు సూచించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India is receiving a "massive influx" of foreign investments which will greatly enhance its ability to develop the manufacturing sector and China should "keep calm" and start working on a more effective growth strategy for the new era, a state-run newspaper said.
Please Wait while comments are loading...