'భారత్ పాక్‌తో యుద్దానికి దిగితే.. చైనా మద్దతు పాక్‌కే..'
ఒకవేళ పాక్ తో భారత్ గనుక యుద్దానికి దిగితే.. తమ చిరకాల మిత్ర దేశం చైనా తమకు మద్దతునిస్తుందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఒకవేళ పాక్ తో భారత్ గనుక యుద్దానికి దిగితే.. తమ చిరకాల మిత్ర దేశం చైనా తమకు మద్దతునిస్తుందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. పాక్ కు చెందిన ప్రతీ రక్షణ వ్యవహారంలోను చైనా తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఖవాజా. కాగా, భారత్ సైనికులు చేసిన దాడుల్లో 10మంది చనిపోగా.. మరో 21మంది గాయాలపాలయ్యారని పాక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. భారత దాడులను తిప్పికొట్టిన పాక్ ఆర్మీ ముగ్గురు భారత జవాన్లను హతం చేసిందని పాక్ పేర్కొంది.

తమ దేశంలోని మహిళలపై, చిన్నపిల్లలపై, అంబులెన్స్ లపై భారత్ ఉద్దేశ్యపూర్వకంగానే దాడులు చేస్తుందని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పాక్ ప్రధాని షరీఫ్ హెచ్చరించారు. కాగా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్న పాకిస్తాన్.. తిరిగి భారత్ పైనే ఆరోపణలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications