భారత్, మయన్మార్, ఉ.కొరియా సరిహద్దుల్లో మోహరించిన చైనా బలగాలు, అందుకే
ఉత్తర కొరియా, భారత్, మయన్మార్ సరిహద్దుల వెంబడి చైనా తన భద్రతా బలగాలను మోహరించింది. చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కు ఐదేళ్లకు ఒకసారి పొలిటికల్ ఈవెంట్ జరుపుతారు.
బీజింగ్: ఉత్తర కొరియా, భారత్, మయన్మార్ సరిహద్దుల వెంబడి చైనా తన భద్రతా బలగాలను మోహరించింది. చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కు ఐదేళ్లకు ఒకసారి పొలిటికల్ ఈవెంట్ జరుపుతారు.
వచ్చే నెలలో జరగనున్న ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మరోసారి అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు కీలక చర్చలు జరిపి, పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలోనే భద్రతకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తూ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చైనా జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత్-చైనా మధ్య డోక్లాంలో నెలకొన్న ప్రతిష్ఠంభన ఇటీవలే సమసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు పాల్పడుతుండడం, మయన్మార్ నుంచి రోహింగ్యాలను తమ భూభాగంలోకి రాకుండా చూసుకోవడం వంటి వాటిపై చైనా దృష్టి పెట్టింది.












Click it and Unblock the Notifications