ఒంటరితనం: అందరూ చూస్తుండగా ఆన్‌లైన్లో యువకుడి ఆత్మహత్య
బీజింగ్: చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగానే ఆన్‌లైన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యను ఓ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈ విషయం తెలిసి పోలీసులు అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కాగా, అతడు అప్పటికే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తనను ఒంటరితనం ఆవరించిందని, జీవితం నిరాశ నిస్పృహలతో ఉందని ఆత్మహత్య చేసుకునే ముందు జెంగ్ మైక్రోబ్లాగులో పెట్టాడు. తాను ఈ మాయా ప్రపంచాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నానని, తనను బతకాలంటూ ఎవరూ ఒత్తిడి చేయొద్దని విజ్ఞప్తి చేశాడు.

తాను ఆత్మహత్య చేసుకోవడం కోసం రకరకాల విషాలు, టేపులు, బొగ్గు తెచ్చుకున్నానని తెలిపాడు. తాను మింగిన విషాలు ప్రభావం చూపడం మొదలుపెట్టాయని, ఓపిక నశిస్తోందని కూడా బ్లాగులో రాశాడు. చాలా మంది అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఆన్‌లైన్లో కలిసిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్పాడని, అయితే ఆమె అతడ్ని ప్రేమిస్తోందో లేదో తెలియదని జెంగ్ నాయనమ్మ చెప్పారు. జెంగ్‌కు రెండేళ్ల వయస్సున్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం అతడి తల్లి మకొ పెళ్లి చేసుకోవడంతో నాయనమ్మ వద్దకు వచ్చేశాడు.












Click it and Unblock the Notifications