పాక్ ఆధీనంలో అభినందన్ విడుదలను స్వాగతించిన చైనా
బీజింగ్: పాకిస్తాన్ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలను చైనా శుక్రవారం స్వాగతించింది. ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పోరాడాలని సూచించింది. శాంతి, సుస్థిరత నెలకొల్పడంలో భాగంగా ఇరు దేశాలు చర్చలు ప్రారంభించాలని చెప్పింది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడిపై సరైన ఆధారాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఇరుదేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు సానుకూల వాతావరణం సృష్టించుకోవాలని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల్లో శాంతి నెలకొనాలన్నదే చైనా అభిమతమన్నారు.

బుధవారం జరిగిన రష్యా, చైనా, భారత్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పుల్వామా దాడిని ముక్తకంఠంతో ఖండించారు. అంతకుముందు చైనా విదేశాంగ మంత్రితో సమావేశమైన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్తాన్ భూభాగంలో భారత్ జరిపిన దాడికి గల కారణాలను వివరించారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications