వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనీస్ ఫుడ్: '8,000 రెస్టారెంట్లలో ఆహారం రుచి చూశాక నాకు తెలిసిందేంటంటే...'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అమెరికాలో చాలామంది చైనీస్ ఆహారాన్ని ఇష్టపడతారు. కానీ, డేవిడ్ ఆర్. చాన్ కాస్త డిఫరెంట్. ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటుంది. లాస్‌ ఏంజెల్స్‌లో ఉండే 72 ఏళ్ల మాజీ లాయర్ చాన్, అమెరికాలోని సుమారు 8000 చైనీస్ రెస్టారెంట్లలో భోజనం చేసినట్లు తెలిపారు.

తాను తిన్న ఆ రెస్టారెంట్ల వివరాలన్నింటిని రాసి పెట్టుకున్నట్లు ఆయన చెబుతారు.

గత నాలుగు దశాబ్దాలుగా తాను ఏయే చైనీస్ రెస్టారెంట్లలో భోజనం చేసింది ఒక స్ప్రెడ్ షీట్‌లో నోట్ చేసి పెట్టుకున్నారాయన. వాటితోపాటు ఆయా రెస్టారెంట్ల బిజినెస్ కార్డులు, మెనూలను కూడా భద్రపరిచారు.

రోజుకొక్క చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్లినా, ఆయన లెక్క ప్రకారం 7,812 రెస్టారెంట్లను సందర్శించడానికి 20 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

పైనాపిల్ బన్స్, పోర్క్ బెల్లీ నుంచి చికెన్ ఫీట్, టీ-స్మోక్డ్ డక్ వరకు వివిధ రకాల వంటలను ఆయన రుచి చూశారు. వీటన్నింటినీ ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

తాను చైనీస్-అమెరికన్ ఐడెంటటీ కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా చాన్ ఈ రెస్టారెంట్ల ప్రయాణాన్ని ప్రారంభించారు. అమెరికాలో పెరుగుతున్న చైనా రెస్టారెంట్లు, సాంస్కృతిక మార్పులకు తాను సాక్షినంటారు చాన్.

అయితే, చాన్ అందరిలాంటి చైనీస్ ఫుడ్ విమర్శకుడు కాదు. తాను ఆహార ప్రియుణ్ని కూడా కాదని ఆయన చెప్పుకుంటారు. ఒక చైనీస్‌ వ్యక్తిగా ఆయనకు చాప్‌స్టిక్స్‌ (చైనీయులు భోజనం తినడానికి ఉపయోగించే పుల్లలు) ను ఉపయోగించడం కూడా తెలియదు.

పైగా, కెఫీన్‌, షుగర్, కొలెస్ట్రాల్‌లాంటి వాటిని తగ్గించడానికి తగ్గట్లుగా ఆయన ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇన్ని నిబంధనలు పెట్టుకున్నా, ఆయన ఆహార ప్రయాణం మాత్రం ఆగలేదు.

https://www.instagram.com/chandavkl/

చైనీస్ ఫుడ్ కలెక్షన్

చాన్ తాత చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ నుంచి కాలిఫోర్నియాకు వలస వచ్చారు. కానీ, చాన్ చిన్నతనంలో చైనీస్ ఫుడ్ తినలేదు. మొదటిసారి తిన్న చైనీస్ ఫుడ్ ఆయనకు నచ్చలేదు కూడా.

''నేను మొదట తిన్న చైనీస్ ఫుడ్ ఏమంత బాగాలేదు'' అని 1950ల నాటి రోజులను గుర్తు చేసుకున్నారు చాన్.

''నేను ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కేవలం అన్నం, సోయాసాస్ తీసుకునే వాడిని'' అన్నారాయన.

19వ శతాబ్దం తొలి అర్ధభాగంలో కాలిఫోర్నియా గోల్డ్ రష్ సమయంలో సంపాదన కోసం అనేకమంది చైనీయులు కాలిఫోర్నియా వచ్చారు. అప్పుడే తొలి చైనీస్ రెస్టారెంట్‌కు బీజం పడింది.

కాంటన్ రెస్టారెంట్ అనే చైనీస్ రెస్టారెంట్ పేరు తొలిసారి 1849 నాటి రికార్డులలో కనిపించింది. ఇది శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటైంది.

అమెరికాకు వచ్చిన చైనీస్ వలసదారులలో ఎక్కువమంది దక్షిణ చైనాలోని కాంటోనీస్ ప్రాంతంలోని టోయిసన్‌కు చెందిన వారు. చైనాలోన తీర ప్రాంతాలలో నివసించే కమ్యూనిటీలకు విదేశాలకు వెళ్లే అలవాటు ఉండేది. అయితే, ఈ వలసలు అనేకమార్లు ఘర్షణలతో రక్తసిక్తమైన సందర్భాలు ఉన్నాయి.

చాన్ తొలిసారి చైనీస్‌ ఫుడ్‌ను రుచి చూసేనాటికి అమెరికాలో చాలా కొద్ది చైనీస్ రెస్టారెంట్లు మాత్రమే ఉండేవి. అప్పటి జనాభాలో చైనీయులు కేవలం 0.08% మాత్రమే ఉండేవారు. వీరిలో చాలామంది టోయిసన్ నుంచి వచ్చినవారే.

తక్కువ జనాభా ఉండటం వల్ల వారి ఆహారపు అలావాట్లపై అమెరికన్ ఫుడ్ కల్చర్ ప్రభావం పడింది. అమెరికన్లకు నచ్చే విధంగా కూడా చైనీస్ వంటకాలను తయారు చేయడం ప్రారంభమైంది.

చైనీస్ సంప్రదాయ వంటలు

కాలం మారింది...

కానీ, 1960ల చివరికి వచ్చేసరికి పరిస్థితులు మారడం ప్రారంభించాయి. కొత్తగా వచ్చిన చట్టాలు ఆసియా నుండి వలసలపై కోటాలను ఎత్తివేయడంతో, చైనా మెయిన్‌లాండ్, హాంకాంగ్, తైవాన్ నుండి వలసలు పెరిగాయి. ఆధునిక కాంటోనీస్ ఆహారాన్ని మాత్రమే కాకుండా చైనావ్యాప్తంగా దొరికే వివిధ ప్రాంతీయ వంటకాలు కూడా అమెరికాకు వలస వచ్చాయి.

అమెరికన్ సివిల్ రైట్స్ ఉద్యమం సమయంలో చాన్ తన చైనీస్ అమెరికన్ వారసత్వాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. అప్పటికి ఆయన కాలేజీ స్టూడెంట్.

1960లలో, ఆయన స్థానిక ఎల్లో పేజెస్‌లో లిస్ట్ చేసిన చైనీస్ రెస్టారెంట్లలో భోజనం చేయడం ప్రారంభించారు.

"ప్రారంభంలో, ఇది కేవలం నా చైనీస్ గుర్తింపు కోసం అన్వేషణ మాత్రమే" అన్నారు చాన్.

"యుఎస్‌లో చైనీస్ చరిత్రపై నా ఆసక్తి నన్ను చైనీస్ ఆహారాన్ని తినేలా చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో చైనీస్‌గా ఉండటం ఎలా ఉంటుందో నాకు నేను తెలుసుకోవడానికి కారణమైంది" అన్నారాయన.

అప్పటి నుంచి చైనీస్ వంటకాల ప్రత్యేకతను ఆయన తెలుసుకోవడం మొదలు పెట్టారు. అంతకు చైనా రుచులు ఆయనకు పెద్దగా తెలియదు.

ఒక టాక్స్ లాయర్‌గా తన సుదీర్ఘ కెరీర్‌లో చాన్, అమెరికాలోని మారుమూల రాష్ట్రాలతోపాటు, కెనడా, ఆసియా పర్యటనలు చేసినప్పుడు కూడా తరచూ చైనీస్ ఆహారాన్ని ఆయన టేస్ట్ చేస్తుండేవారు.

1972లో చైనా పర్యటన సందర్భంగా ప్రధాని చౌ-ఎన్-లై తో విందు ఆరగిస్తున్న నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్

చైనా ఫుడ్ కేంద్రాలు

అమెరికాలో అత్యంత వైవిధ్యమైన, అసలైన చైనీస్ ఆహారం కావాలంటే లాస్‌ఏంజెలస్‌లోని శాన్ గాబ్రియేల్ వ్యాలీకి వెళ్లాల్సిందేనంటారు చాన్. ఇది చైనీస్ వలసదారుల రాజధాని అంటారాయన. కాస్త అటు ఇటుగా శాన్‌ఫ్రాన్సిస్కో కూడా అలాగే ఉంటుందని చెప్పారు చాన్.

అమెరికాకు వలస వచ్చే చైనీస్‌ విద్యార్ధుల కారణంగా ఇక్కడ రెస్టారెంట్ల సంఖ్య కూడా పెరిగిందని చాన్ అంటారు. ఒక రకంగా అమెరికాలో ఫుడ్ డెమొక్రసీ వచ్చి, చైనీస్ రుచులు అందరూ ఆస్వాదించేందుకు అవకాశం ఏర్పడిందంటారు చాన్

అమెరికాలో చైనీస్ ఫుడ్‌పట్ల ఆకర్షణ ఏర్పడటానికి మరొక కారణం 1972లో ఆ దేశ అధ్యక్షుడు చైనా పర్యటన కూడా ఒక కారణంగా చెబుతారు.

రిచర్డ్ నిక్సన్ బీజింగ్‌లో పర్యటించినప్పుడు, అప్పటి చైనీస్ ప్రీమియర్ చౌ-ఎన్-లై తో కలిసి ఆయన విందు భోజనం చేయడం అమెరికా అంతటా ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. కోట్లమంది అమెరికన్లు తమ అధ్యక్షుడు చాప్‌స్టిక్‌లు పట్టుకుని చైనీస్ ఫుడ్‌ తినడాన్ని చూశారు.

"యు.ఎస్‌.లో చైనీస్ ఫుడ్ డెవలప్‌మెంట్ నిక్సన్ పర్యటన తర్వాత రెండో దశకు చేరుకుంది" అని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హిస్టరీ ప్రొఫెసర్ యాంగ్‌చెన్ అన్నారు.

నిక్సన్ "చాప్‌స్టిక్ డిప్లొమసీ" కి అయిదు నెలల తర్వాత , న్యూయార్క్ టైమ్స్ "చైనీస్ రెస్టారెంట్స్ ఫ్లవర్ ఫాలోయింగ్ డిప్లొమాటిక్ థా" అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం అమెరికా అంతటా దాదాపు 45,000 కంటే ఎక్కువ చైనీస్ రెస్టారెంట్లు ఉన్నాయి. చైనీస్ అమెరికన్ రెస్టారెంట్ అసోసియేషన్ అంచనా ప్రకారం ఈ సంఖ్య మెక్‌డోనాల్డ్, బర్గర్ కింగ్, కెంటకీ ఫ్రైడ్ చికెన్, వెండీస్ అవుట్‌లెట్‌ల సంఖ్య కంటే ఎక్కువ

సెలవు రోజుల్లో చైనీస్ బన్ ను తినడం అమెరికాలో చాలామందికి అలవాటు

ఎందుకంత మోజు

చైనీస్ రెస్టారెంట్ల మరో ప్రత్యేకత ఏంటంటే, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, గవర్నమెంట్ హాలీడేలు సహా అనేక సెలవు దినాల్లో కూడా చాలాచోట్ల తెరిచే ఉంటాయి. ఇంట్లో భారీ ఎత్తున వంటలు చేసుకోలేని వారికి ఇవి సహజ ఎంపికలుగా మారాయి.

చైనాకు చెందిన పాతతరం వంటకాలతోపాటు, అత్యాధునిక ఫుడ్‌‌ను అందించే వివిధ రెస్టారెంట్లు ఇప్పుడు అమెరికాలో ఉన్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలలో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ట్రెండ్, చాన్ కలెక్షన్‌కు ఎంతగానో ఉపయోగపడింది. ఆయన తాను ఇన్ని రెస్టారెంట్లకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకోలేదు. వీలైనన్ని ఎక్కువ రెస్టారెంట్లను సందర్శించడమే పనిగా పెట్టుకున్నారాయన.

తన వృత్తి నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొత్త చైనీస్ రెస్టారెంట్ల కోసం అన్వేషించడంతోపాటు, తన ఫుడ్ బ్లాగ్‌ను కొనసాగిస్తున్నారు చాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chinese Food: 'After tasting the food in 8,000 restaurants, I know'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X