చైనా నిర్లక్ష్యం: నోబెల్ బహుమతి గ్రహీత షియాగో కన్నుమూత
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల పోరాట యోధుడు ల్యూ షియాబో(61) కన్నుమూశారు. చైనాకు చెందిన ఆయన.. కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.
షెన్‌యాంగ్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల పోరాట యోధుడు ల్యూ షియాబో(61) కన్నుమూశారు. చైనాకు చెందిన ఆయన.. కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. చైనా నిర్లక్ష్యం కారణంగా సరైన వైద్య సదుపాయం అందకపోవడంతోనే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
చైనాలో రాజకీయ సంస్కరణలు తీసుకురావాలని.. కమ్యూనిస్టు పార్టీ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలకాలని షియోబో దీర్ఘ కాలం పోరాడారు. దీంతో విద్రోహ ఆరోపణలపై 2009లో ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. 11 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో షెన్‌యాంగ్‌లోని ఓ ఆస్పత్రిలో కొంతకాలంగా ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను విదేశాలకు తరలించాలంటూ అంతర్జాతీయంగా పలు హక్కుల సంస్థలు డిమాండ్ చేసినప్పటికీ చైనా పట్టించుకోలేదు.
అత్యుత్తమ వైద్యులే చికిత్సనందిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. కాగా, 2010లో షియోబో నోబెల్ బహుమతి పొందారు. కాగా, ఇప్పటికైనా గృహ నిర్బంధంలో ఉన్న షియాబో భార్యను వదిలి వేయాలని, ఆమెను విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని చైనాను అమెరికా కోరింది.












Click it and Unblock the Notifications