వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామసేతుపై గడ్కరీ, పాక్‌లో క్రైస్తవ జంట సజీవ దహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Christian couple burnt alive in Pakistan for alleged blasphemy
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: సేతు సముద్రం షిప్పింగ్‌ చానెల్‌ ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌సీపీ) అమలు కోసం రామసేతును కూల్చబోమని కేంద్ర నౌకాయాన, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం స్పష్టం చేశారు. ఇందుకు అనువైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామన్నారు.

ఆయన ఈ ప్రాంతాన్ని గగనతలం నుంచి పరిశీలించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు శ్రీరాముడు నిర్మించినట్లు చెబుతున్న రామసేతు వారధికి ఇబ్బంది కలగకుండా ప్రాజెక్టును అమలుచేయడంపై అధికారులతో మంత్రి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఈ ప్రాజెక్టును చేపడతామన్నారు. యూపీఏ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చంతా వృథాయేనా? అన్న ప్రశ్నకు... పూర్తయిన ప్రాజెక్టును ఇతర అవసరాలకు వాడుకుంటామని చెప్పారు. ఇక శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించిన తమవారిని రక్షించాలంటూ ఐదుగురు భారత జాలర్ల కుటుంబసభ్యులు ఆయనను కలవగా, ఇందుకోసం ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంటోందని, ధైర్యంగా ఉండాలన్నారు.

పాకిస్తాన్‌లో క్రైస్తవ దంపతుల సజీవ దహనం

పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవ జంటను కొందరు భగభగ మండుతున్న సున్నపు బట్టీలో తోసి సజీవదహనం చేశారు. పంజాబ్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో మంగళవారం ఈ ఘోరం జరిగింది.

అక్కడి సున్నపు బట్టీలో షహజాద్‌(35), షమా (31) దంపతులు పని చేస్తున్నారు. పనిమానేస్తామన్నందుకు ఆగ్రహించిన యజమాని రూ.5 లక్షలిచ్చి వెళ్లమంటూ దంపతులను, వారి నలుగురు పిల్లల్ని బంధించాడు. పైగా ఖురాన్‌ను చింపేశారని ప్రచారం చేయడంతో స్థానికులు చిత్రహింసలు పెట్టి దంపతులను చంపేశారు.

English summary
In a gruesome incident,?a Christian couple was on Tuesday thrashed and burnt alive by a group of angry Muslims in Pakistan's Punjab province for allegedly desecrating the Quran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X