క్రిస్మస్​ కు ముందే వెనిజులాపై దాడికి ప్లాన్​.. కానీ ఆ కారణంతో..

వెనిజులాపై అమెరికా సైన్యం వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్‌ ఈ ఆపరేషన్‌ చేపట్టింది. అయితే ఇప్పుడో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. వెనిజులాపై దాడికి కొన్ని రోజుల ముందే అమెరికా ప్లాన్ చేసినట్లు సమాచారం.

క్రిస్మస్ కు ముందే దాడులు చేపట్టి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేయాలని అమెరికా భావించినట్లు సమాచారం. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ దాడులు జనవరి 3 కు వాయిదా వేసుకున్నట్లు తేలింది. ఇదే విషయాన్ని జాయింట్ చీఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ దాడులకోసం కొన్ని నెలల నుంచే ప్రాక్టీస్, రిహార్సల్స్ చేపట్టినట్లు సమాచారం అందుతోంది.

Christmas Raid Postponed Bad Weather Delayed US Capture of Maduro in Venezuela

మేఘాలు, పర్వతాలు, సముద్రం ఇలా పలు అడ్డంకుల కారణంగా వెనిజులాపై అమెరికా చేపట్టిన మిషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ ఆపరేషన్ ను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై అమెరికా సైన్యం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లగా.. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలోనే ముందుకు వెళ్లాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు క్రిస్మస్ రోజున అమెరికా సైన్యం నైజీరియాపై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే ఈ ఆపరేషన్ లేట్ అయినట్లు సమాచారం అందుతోంది.

ఇక జనవరి 3న అర్ధరాత్రి సమయంలో వెనిజులాపై అమెరికా సైన్యం ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ చేపట్టిన విషయం తెలిసిందే. అమెరికా వైమానిక దళాలు వెనిజులా రాజధాని కరాకస్ లోని ఏడు ప్రాంతాల్లో దాడులు చేశాయి. ఉత్తర వెనిజులాలోని మిలిటరీ ప్రాంతాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అక్కడి నుంచి న్యూ యార్క్ కు తరలించింది. ఇక నికోలస్ మదురోపై నార్కో-టెర్రరిజం కేసు పెట్టినట్లు యూఎస్​అటార్నీ జనరల్​పమేలా బోండి తెలిపారు. ఆయనపై అమెరికా చట్టాల ప్రకారం విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

ఇక వెనిజులాపై అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం వీరోచిత పోరాటం చేసిందన్నారు. అమెరికా సైన్యాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అమెరికా సైన్యం.. స్పీడ్, చురుకుదనం, నాణ్యతతో దాడులు జరిపిందన్నారు. అమెరికన్ మిలిటరీ సేఫ్ అని.. ఎవరూ మృతి చెందలేదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+