Viral Vide: నాతోనే ఆటలా.. ట్రైనర్ పై ఎలుగుబంటి దాడి.. వైరల్ అవుతున్న వీడియో..
ఇటీవల ఓ మొసలి ట్రైనర్ దాని నోట్ల చేయి గాయపరుచుకున్నాడు. తాజాగా ఓ ఎలుగుబంటి ట్రైనర్ ఏదో చేయబోతే ఆ ఎలుగుబంటి అతడిపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎలుగుబంటి సర్కస్‌లో తన ట్రైనర్‌పై దాడి చేయడంతో అక్కడున్న భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి మహిళ కాళ్లపై పంజా దాడి చేసింది. దీంతో ట్రైనర్ నిస్సహాయంగా రింగ్ లో పడిపోయింది. మరో ఇద్దరు శిక్షకులు ఎలుగుబంటిని తప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన రష్యాలోని కెమెరోవో ప్రాంతంలోని బెరెజోవ్‌స్కీలో జరిగింది. ఎలుగుబండి దాడి తర్వాత ట్రైనర్ కు గాయాలు కాగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. హర్లెక్విన్ ట్రావెలింగ్ సర్కస్ దీనిపై స్పందిస్తూ దాడి జరగలేదని పేర్కొంది."ఏ సంఘటన కూడా జరగలేదు. "సరళంగా చెప్పాలంటే, ఎలుగుబంట్లు ఇప్పుడు సంభోగం సీజన్‌లో ఉన్నాయి. చిన్న చిన్న దాడులు సహజం" అని సర్కస్ ప్రతినిధి చెప్పారు. రష్యాలో సర్కస్ ప్రదర్శనకు మంచి ఆదారణ ఉంది. ఇక్కడ అనే రకాల జంతువులతో సర్కస్ లో విన్యాసాలు చేయిస్తుంటారు.












Click it and Unblock the Notifications