సూడాన్ ఘర్షణలో 100 మంది మృతి: భారతీయుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఖార్తూమ్: సూడాన్‌లో మిలిటరీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్) మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణల కారణంగా హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు వందమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలో ఓ భారతీయుడు కూడా మరణించారు.
ఈ నేపథ్యంలో భారతీయ దౌత్య కార్యాలయం సూడాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో జరుగుతున్న హింసాకాండలో బుల్లెట్ గాయాలతో భారతీయ పౌరుడు మరణించాడని భారత రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే.

'భారతీయులు ఎక్కడున్నారో అక్కడే ఉండాలని, బయటికి వెళ్లవద్దని మేము కోరుతున్నాము' తాజాగా మరోసారి సూచించింది. సుడాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమాచారం, సహాయం అందించడానికి 24X7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
హెల్ప్‌లైన్ నంబర్‌లు 1800118797, +91-11-23012113, +91-11-23014104, +91-11-23017905, +91 9968291988.
కాగా, సుడాన్‌లోని భారతీయులు దాదాపు 4,000 మంది ఉన్నారు. వీరిలో 1,200 మంది దశాబ్దాల క్రితం అక్కడ స్థిరపడ్డారు. అక్టోబరు 2021లో జరిగిన తిరుగుబాటులో సూడానీస్ మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి దేశాన్ని సార్వభౌమ మండలి ద్వారా నడిపించింది. సూడాన్‌పై నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తివంతమైన పారామిలటరీ దళం మధ్య సోమవారం వరుసగా మూడో రోజు పోరు కొనసాగింది. ఈ పోరాటంలో గత రెండు రోజుల్లో 97 మంది సామాన్యులు చనిపోయారు. అదే సమయంలో, 1,126 మంది గాయపడ్డారు.
IMPORTANT: In view of the current situation in #Sudan, a Control Room has been set up at Ministry of External Affairs to provide information and assistance pic.twitter.com/hdF7V0ji0H
— Nayanima Basu (@NayanimaBasu) April 17, 2023
సుడాన్‌లో జరుగుతున్న పోరాటాలను వీలైనంత త్వరగా ఆపాలని అమెరికా, బ్రిటన్‌లు కూడా కోరాయి. జీ7 సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. 'సుడాన్ ప్రజలు సైన్యం తమ బ్యారక్‌లకు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. వారికి ప్రజాస్వామ్యం, పౌర పాలన కావాలన్నారు.












Click it and Unblock the Notifications