వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కప్పులకు కప్పులు కాఫీ తాగారంటే, మీ ప్రాణాలు మీ చేతిలో లేనట్టే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాఫీ ఎక్కువగా తాగితే ప్రాణాలకు ముప్పే || Drinking Too Much Coffee May Trigger Migraine || Onendia

ఆఫీసులో హెవీ వర్క్‌తో అలసిపోయి ఉంటే ఓ కప్పు కాఫీ తాగుతాం. దీంతో తిరిగి ఎనర్జీ పొంది మళ్లీ పనిలోకి దిగిపోతాం. కాఫీ తాగితే అదేదో రిలాక్స్ అయినట్లుగా ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక మంది సేవించే బెవెరేజ్ కాఫీనే. అత్యంత పనిభారం ఉన్నప్పుడు ఒక్క కాఫీ గుటక అలా నోట్లో పడితే చాలు ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. రిఫ్రెషింగ్‌గా ఉంది కదా అని కప్పులకు కప్పులు లాగిస్తే మన ప్రాణాలు మన చేతులో లేనట్లే లెక్క.తాజాగా ఓ అధ్యయనం ఇదే చెబుతోంది.

 కాఫీతో ఆరోగ్యానికి మేలు..అదేసమయంలో హానికరం కూడా

కాఫీతో ఆరోగ్యానికి మేలు..అదేసమయంలో హానికరం కూడా

అనుదినం కాఫీనే అసలు కిక్కు..కొద్దిగైనా పడకుంటే పెద్ద చిక్కు..కప్పు కాఫీ లభించడమే గొప్ప లక్కు..అమృతం అన్నది కాఫీ ముందు హంబక్కే అని కాఫీ గురించి ఓ సినీకవి దండకం అందుకున్నాడు. కాఫీని అంత గొప్పగా వర్ణించారు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంత మేలు కూడా కలుగుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇందులో టైప్ 2 డయాబెటీస్, స్ట్రోక్, కొన్ని క్యాన్సర్లు రావని పరిశోధనలు వెల్లడించాయి. ఇందుకు కారణం కాఫీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మరియు న్యూట్రియెంట్సే కారణం. కాఫీలో కెఫీన్ ఉండటంతో శరీర బరువు కూడా తగ్గుతుందని రీసెర్చ్‌లు చెప్పాయి. అయితే కొత్త అధ్యయనాల ప్రకారం కాఫీ ఎక్కువగా తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.

మహిళలే ఎక్కువమంది మైగ్రేన్ బాధితులు

మహిళలే ఎక్కువమంది మైగ్రేన్ బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ మంది మైగ్రేన్‌ వ్యాధితో బాధపడుతున్నారని పరిశోధనల ద్వారా వెల్లడైంది. మైగ్రేన్ వచ్చిందంటే దాని బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని వైద్యులు తెలుపుతున్నారు. తరుచూ ఆవలింతలు రావడం, తలనొప్పి, శబ్దం అంటే పడకపోవడం, ఆకలి కాకపోవడం డిప్రెషన్‌లాంటివి మైగ్రేన్‌తో వస్తాయి. ఈ మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా ఉంటుంది.ఒకే కుటుంబంలో అందరికీ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.మైగ్రేన్‌కు సంబంధించి కొత్తగా చేసిన పరిశోధనల్లో ఆసక్తి కరమైన అంశాలు వెలుగు చూశాయి. 100 మంది యువతీ యువకుల్లో ఎపిసోడిక్ మైగ్రేన్ అనే జబ్బు ఉన్నట్లు కనుగొన్నారు. నెలలో 14 రోజులు పాటు తలనొప్పితో బాధపడేవారిలో ఈ ఎపిసోడిక్ మైగ్రేన్ ఉన్నట్లు తెలిపారు. 15 రోజులకంటే ఎక్కువగా తలనొప్పి వస్తే దాన్ని క్రానిక్ మైగ్రేన్ అని పిలుస్తున్నారు. అయితే మైగ్రేన్ తలనొప్పికి కెఫీన్ సరైన మందుగా పనిచేస్తుందా లేదా అనేదానిపై పరీక్షలు నిర్వహించారు.అయితే మూడు కప్పులు లేదా అంతకంటే మించి కాఫీ తీసుకుంటే మైగ్రేన్ మరింత పెరిగే ప్రమాదం ఉందని వారి పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు. అయితే కప్పు కాఫీ లేదా రెండు కప్పుల కాఫీలతో తలనొప్పి రాదని చెప్పారు.

మైగ్రేన్ పేషంట్లకు ఐవీ ద్వారా కెఫెన్‌

మైగ్రేన్ పేషంట్లకు ఐవీ ద్వారా కెఫెన్‌

ఇక వరుసగా రోజుల తరబడి కాఫీలు తాగే వారికి మేలులు ఎన్ని ఉన్నాయో దానివల్ల కీడు కూడా అంతే స్థాయిలో ఉన్నట్లు విశ్లేషించారు. అంటే కెఫీన్ తలనొప్పికి మందుగా పనిచేయడమే కాదు కొత్తగా మైగ్రేన్‌ను కూడా తీసుకువచ్చే అవకాశాలున్నట్లు తేల్చారు. అయితే తలనొప్పికి తక్షణ మందు కాఫీనే అని చెబుతున్న పరిశోధకులు మైగ్రేన్‌తో బాధపడేవారికి హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డుల్లో ఐవీ ద్వారా కెఫీన్ ఎక్కించి అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నిద్రలేమీ ఉన్నట్లయితే మైగ్రేన్‌ తీవ్రతను ఎక్కువగా చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కెఫీన్‌‌ను ఎంత మోతాదులో ఎన్నిసార్లు తీసుకుంటున్నారో అనేదానిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మైగ్రేన్ తీవ్రంగా ఉన్నప్పుడు స్వల్ప మోతాదులో కాఫీ తాగితే అప్పటికి కాస్త రిలీఫ్ లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే మైగ్రేన్ ఉన్నవారు కాఫీ తీసుకుంటే తగ్గుతుంది అని చెప్పేందుకు పూర్తి స్థాయిలో రుజువులు లేవని చెబుతున్నారు.

చివరిగా కాఫీలు కప్పులకు కప్పులు సేవించేవారిలోనే మైగ్రేన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే రోజుకు రెండు కప్పులు కాఫీ తాగే వారిలో ఈ మైగ్రేన్ ప్రభావం కనిపించలేదని చెప్పారు. అయితే అమెరికా మైగ్రేన్ ఫౌండేషన్ మాత్రం కెఫీన్‌తో కూడిన ద్రవపదార్థాలు తీసుకోవడంతోనే తీవ్రమైన తలనొప్పులు వస్తున్నాయని మైగ్రేన్ కూడా వస్తోందని పేర్కొంది.

English summary
Coffee is undoubtedly one of the most consumed beverages in the world.Research has shown that coffee can also provide some major health benefits. However, a new study suggested that consuming too much coffee or other caffeinated drinks may increase the risk of developing a migraine headache.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X