మినీ స్కర్ట్‌లు వేసుకురావద్దంటే.. అందరూ వాటినే వేసుకొచ్చి...

బొగటా: పొట్టి దుస్తులతో కాలేజీకి రాకండి.. ముఖ్యంగా మినీ స్కర్ట్‌లు ధరించి విద్యార్థులు, టీచర్లను రెచ్చగొట్టకండి అంటూ ఓ యూనివర్సిటీ విద్యార్థినులకు సుద్దులు చెప్పింది. కానీ జరిగిందేమిటో తెలుసా? అమ్మాయిలు మొత్తం మినీ స్కర్ట్‌లు ధరించి హాజరయ్యారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం తెల్లమొహం వేసింది.

ఈ ఘటన గురువారం కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగింది. విద్యార్థినులు చిట్టి, పొట్టి దుస్తులు ధరించి రావడం విద్యార్థులను డిస్టర్బ్ చేస్తోందని, కాబట్టి అలాంటి దుస్తులు ధరించి రాకూడదంటూ బొలివేరియన్ విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

Colombian University Students Wear Miniskirts To Protest Against Sexism

దీంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. యాజమాన్యానికి తమ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో అందరూ మినీ స్కర్ట్‌లే ధరించి హాజరయ్యారు. విచిత్రం ఏమిటంటే అమ్మాయిలను సమర్థిస్తూ విద్యార్థులు కూడా షార్ట్‌లు వేసుకుని రావడం.

అంతేకాదు, ఆ దుస్తుల్లో వారు ఫొటోలు దిగి వాటిని పరస్పరం షేర్ కూడా చేసుకున్నారు. డ్రెస్సింగ్ గురించి తమకేమీ చెప్పవద్దంటూ పరోక్షంగా విద్యార్థులంతా తమదైన స్టయిల్లో యూనివర్సిటీ యాజమాన్యానికి వార్నింగ్ ఇవ్వడంతో యాజమాన్యం కూడా వర్సిటీ వెబ్‌సైట్ నుంచి తన ఆదేశాలతో కూడిన ప్రకటనను తొలగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+