వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ చైనా చర్చలు: లదాక్ నుంచి వెనక్కి.. మనం మిత్రులంటూ డ్రాగన్ కొత్త రాగం.. అమెరికాపై విసుర్లు..

|
Google Oneindia TeluguNews

భారత్ - చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దాదాపుగా చల్లారాయి. శుక్రవారం రెండు దేశాల మధ్య జరిగిన రాయబార చర్చలు ఫలవంతంగా ముగిశాయి. జూన్ 30న లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయిలో కుదిరిగిన అవగాహన ఒప్పందాలను రెండు దేశాలూ నిబద్ధతతో అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగా తూర్పు లదాక్ నుంచి ఇరు సైన్యాలూ పూర్తిగా వెనక్కి మళ్ళాలని నిశ్చయించుకున్నాయి.

పక్కదేశాల్లో చిచ్చు పెట్టడం చైనా తర్వాతే.. కజకిస్తాన్‌లో కొత్త వైరస్ వ్యాప్తి వట్టిదే.. అసలు కథ..పక్కదేశాల్లో చిచ్చు పెట్టడం చైనా తర్వాతే.. కజకిస్తాన్‌లో కొత్త వైరస్ వ్యాప్తి వట్టిదే.. అసలు కథ..

 తూర్పు లదాక్ పై..

తూర్పు లదాక్ పై..

వర్కింగ్ మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) ప్రక్రియలో భాగంగా శుక్రవారం భారత్, చైనా విదేశాంగ శాఖల ప్రతినిధులు భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో... వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి సంపూర్ణ శాంతి నెలకొనేలా.. గతంలో ఉద్రిక్తతలకు నిలయమైన తూర్పు లదాక్ ప్రాంతం నుంచి రెండు వైపులా బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. తూర్పు లదాక్ ను పూర్తిగా ఖాళీ చేసే ప్రక్రియ ఎలా చేపట్టాలనేదానిపై సైనిక స్థాయిలో మరోసారి చర్చలు జరుగుతాయని తెలిపింది.

 ఇలా మారిన పరిణామాలు..

ఇలా మారిన పరిణామాలు..

తూర్పు లదాక్ లో రెండు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగడం, గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత జవాన్లను చైనా కిరాతకంగా చంపేసిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి. చివరికి శాంతికి మాత్రమే కట్టుబడి ఉంటాన్న భారత్ వాదనకే చైనా జైకొట్టాల్సివచ్చింది. గత శుక్రవారం ప్రధాని మోదీ లేహ్ పర్యటన, ఆ వెంటనే స్పెషల్ రిప్రెజెంటేటివ్ హోదాలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రితో చర్చలు, సోమవారం నాటికి రెండు వైపులా బలగాల ఉపసంహరణ చకచకా జరిగిపోయాయి. ఇదిలాఉంటే..

మనం దోస్తులమే

మనం దోస్తులమే

మనం దోస్తులమే.. కారణాలు ఏవైనా కావొచ్చుగానీ, భారత్ పట్ల తన పంథా మార్చుకున్నట్లు చైనా కీలక సంకేతాలిచ్చింది. భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ శుక్రవారం అనూహ్య ప్రకటనలు చేశారు. భారత్‌-చైనాలు ప్రత్యర్థులుగా కాకుండా ఎల్లప్పుడూ భాగస్వాములుగానే ఉండాలని, ఉంటాయని, సరిహద్దు వివాదంపై కూడా ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించుకుని ఓ కచ్చితమైన నిర్ణయానికి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం బాధాకరమని, ఇలాంటి కీలక సందర్భాల్లోనే ఇరు దేశాలు శాంతిగా మెలగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు..

ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు..

‘‘సరిహద్దులు ఎప్పుడూ శాంతియుతంగానే ఉండాలని చైనా కోరుకుంటోంది. భారత్ కూడా అందుకు సహకరించాలి. మన రెండు దేశాలూ పరస్పరం యుద్ధం చేస్తే అది శత్రవులకు బలాన్నిచ్చినట్లు అవుతుంది. అంతేకాదు, మన పొరుగునే ఉన్న చిన్న దేశాలకు కూడా నష్టం కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత గాడి తప్పాయి. అయితే పరిస్థితులు అతిత్వరలో చక్కబడతాయన్న నమ్మకం నాకుంది'' అని సన్ వీడాంగ్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Asia’s Largest Solar Plant in MP భారత్ ఆదర్శమని యూఎన్ ప్రశంస, ఐదు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్ !

సీఎం జగన్ కు మరో షాక్.. బాషా దూకుడు.. వైసీపీ గుర్తింపు రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు..సీఎం జగన్ కు మరో షాక్.. బాషా దూకుడు.. వైసీపీ గుర్తింపు రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు..

English summary
India and China on Friday held a fresh round of diplomatic talks on the border row in eastern Ladakh and reaffirmed to ensure "complete disengagement" of the troops in the region for "full restoration" of peace and tranquility along LAC. Partners, rather than rivals says Chinese ambassador to India Line of Actual Control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X