COP26 Climate Summit: బిల్ గేట్స్‌తో ప్రధాని మోడీ సమావేశం, కీలక అంశాలపై చర్చ
గ్లాస్గో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్-26 సదస్సు సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ కో ఫౌండర్ బిల్ గేట్స్‌తో ప్రధాని మోడీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశంలో పెటుబడులు, ఉపాధి తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. వాతావరణ మార్పులను తగ్గించడంలో కృషి చేయడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించిటన్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా భారత్ కు అవసరమైన సహకారం అందిస్తామని బిల్ గేట్స్ ఇప్పటికే ప్రకటించారు. భారత్ లో కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో బిల్ గేట్స్‌తో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన విషయం తెలిసిందే.

కాగా.. అంతకుముందు రోజు ప్రధాని మోడీ నేపాలీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. భారత ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐరిస్) కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రారంభించారు. కాగా.. కాప్26 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆదివారం గ్లాస్గో చేరుకున్నారు.
Recommended Video
మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెత్ తోనూ నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. 'ఇజ్రాయెల్ లో అత్యంత పాపులర్ వ్యక్తి మీరే.. వచ్చి మా పార్టీలో చేరండి' అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నట్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి మోడీ పెద్దగా నవ్వుతూ అభినందనలను స్వీకరించారు. బెన్నెట్‌తో ప్రధాని మోడీ భేటీ కావడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications