వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

COP26: ఎకో ఫ్రెండ్లీ సెక్స్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మనిషి సెక్స్ జీవితం పర్యావరణం మీద ఎంత ప్రభావం చూపుతుంది?

కార్బన్ ఫుట్ ప్రింట్స్ గురించి మాట్లాడేటప్పుడు మన లైంగిక జీవితానికి సంబంధించిన విషయాలు అందులో ఎక్కువగా ఉండవు. అయినా సరే, పర్యావరణ అనుకూల కండోమ్‌లు, వ్యర్థాలు లేని గర్భ నిరోధక మాత్రలపై ఆన్‌లైన్‌లో సెర్చ్ జరుగుతూనే ఉంది.

"కొందరికి, ఎకో-ఫ్రెండ్లీ సెక్సువల్‌గా ఉండటం.. అంటే భూమి మీద తక్కువ ప్రభావం చూపే లూబ్రికెంట్లు, బొమ్మలు, బెడ్‌షీట్లు, కండోమ్‌లను ఎంచుకోవడం'' అని నైజీరియాకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ అడెనికే అకిన్‌సెమోలు వివరించారు.

ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ అంచనా ప్రకారం ఏటా సుమారు వెయ్యి కోట్ల కండోమ్‌లు తయారు చేస్తున్నారు. ఇవన్నీ చివరకు చెత్తకుప్పల్లో చేరతాయి.

వీటి వల్ల పర్యావరణానికి నష్టం ఉంది. ఎందుకంటే ఇవి సింథటిక్ రబ్బరు, ఇతర రసాయనాలతో కలసి తయారవుతాయి. రీ సైకిల్ చేయడం సాధ్యం కాదు.

రోమన్ల కాలం నుండి ఉపయోగిస్తున్న లాంబ్‌స్కిన్ కండోమ్‌లు మాత్రమే పూర్తిగా బయో డిగ్రేడబుల్ కండోమ్‌లు. కానీ, అవి గొర్రెల పేగు నుంచి తయారవుతాయి. ఇవి లైంగికంగా సంక్రమించే అంటు వ్యాధులను నిరోధించలేవు.

అనేక లూబ్రికెంట్లు కూడా పెట్రోలియం ఆధారితమైనవి. అంటే వీటిలో శిలాజ ఇంధనాలు ఉంటాయి. ఈ పరిణామాలు నీటి ఆధారిత లేదా సేంద్రియ ఉత్పత్తుల పెరుగుదలకు దారి తీసింది. ఇంట్లో తయారు చేసుకునే ఆప్షన్లకు జనాదరణ పెరుగుతోంది.

ఇంట్లోనే లూబ్రికెంట్ తయారుచేసుకోవచ్చా?

లైంగిక ఆరోగ్యంపై డాక్టర్ టెస్సా కమర్స్ చేసే టిక్‌టాక్ వీడియోలను ఫాలో అయ్యేవారు పది లక్షల కంటే ఎక్కువమంది ఉన్నారు. ఆమె వీడియోలలో ఒకదానికి 80 లక్షల వ్యూస్ వచ్చాయి. మొక్కజొన్న పిండి, నీరు కలిపి ఇంట్లో తయారు చేసుకునే లూబ్రికెంట్ రెసీపీ గురించి ఈ వీడియో చెబుతుంది.

"నీటి ఆధారిత లూబ్రికెట్లు, సేంద్రియ, వీగన్ కండోమ్‌లు సెక్స్ జీవితాన్ని ఆనందించడానికి ఒక మంచి ఆప్షన్" అని డాక్టర్ అకిన్‌సెమోలు చెప్పారు. ''అవి పర్యావరణానికి కొద్దిపాటి నష్టాన్ని మాత్రమే కలిగిస్తాయి. యూజర్లకు ఆనందాన్నిస్తాయి'' అన్నారామె.

అయితే, ఈ గ్రీన్ ప్రోడక్ట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఒక్కోసారి చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటివి వాడే ముందు డాక్టర్ల సలహా తప్పనిసరి.

ప్లాస్టిక్ వాడకం విస్తృతంగా ఉన్న మరొక అంశం సెక్స్ టాయ్స్. మెటల్, గాజుతో చేసిన సెక్స్ టాయ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, రీయూజ్ చేసే టాయ్స్‌‌ను వాడటం వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మార్కెట్‌లో సౌరశక్తితో నడిచే సెక్స్ టాయ్‌లు కూడా ఉన్నాయి.

లవ్‌హనీ వంటి కంపెనీలు సెక్స్ టాయ్ అమ్నెస్టీని కూడా అందిస్తాయి. అవి సాధారణ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయలేని పాత, విరిగిన సెక్స్ టాయ్స్‌ను రీసైక్లింగ్ చేయడంలో సహాయ పడతాయి.

వ్యర్థాలను ఎక్కడ తగ్గించవచ్చు?

మన లైంగిక జీవితంలో వ్యర్థాలను తగ్గించగల అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

నియమబద్ధంగా తయారు చేసిన లోదుస్తులు వాడటం, షవర్ సెక్స్‌ను తగ్గించడం, తక్కువ వేడి నీటిని వాడటం, లైట్లు త్వరగా ఆర్పేయడం, రీయూజ్ చేసే వాష్‌క్లాత్‌లను ఎంచుకోవడం వంటివి ఈ భూమి మీద పర్యావరణానికి మానవుడు కలిగించే హానిని తగ్గించే కొన్ని మార్గాలు.

మనం కొనుగోలు చేసే చాలా వస్తువుల మాదిరిగానే, ప్యాకేజింగ్ తరచుగా వ్యర్థాలకు కారణమవుతుంది. చాలా కంపెనీలు ఈ విషయంలో జాగ్రత్త పడితే మంచిదని, న్యూయార్క్‌కు చెందిన జీరో వేస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ లారెన్ సింగర్ అన్నారు.

కండోమ్‌లు, ల్యూబ్రికెంట్లు, రోజువారీ గర్భనిరోధక మాత్రలు అన్నీ చివరకు చెత్తకుప్పల్లోకే వెళతాయి. గర్భాశయ ప్రోడక్టులు, ఇంప్లాంట్‌లు, దీర్ఘకాలిక గర్భనిరోధక ఆప్షన్లు ఇలాంటి వ్యర్థాలను తగ్గిస్తాయని ఆమె అన్నారు.

అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా

లారెన్ పూర్తిగా వ్యర్థాలు లేకుండా జీవిస్తారు. 2012 నుండి ఆమె తాను రీసైకిల్ చేయలేని వాటిని ఒక డబ్బాలో పెట్టి ఉంచారు.

లారెన్స్‌ ఆ డబ్బాలో భద్రపరిచిన వాటిలో ఒక్క కండోమ్‌ కూడా ఉండదు. అయితే లైంగికంగా సంక్రమించే వ్యాధులు రాకుండా ఆపగలిగేవి కండోమ్‌లు మాత్రమే. కానీ, వ్యర్థాల నివారణకు గాను ఆమె వాటిని వాడటం లేదు.

తన పార్ట్‌నర్‌లు ఎవరైనా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరతారు.

"నేను ఇప్పుడు ఒకే వ్యక్తితో జీవిస్తున్నాను. అయితే, మీరు మీ పార్ట్‌నర్‌ను టెస్టు చేయించుకోవాలని అడగలేనప్పుడు వారితో సెక్స్‌లో పాల్గొనడం కూడా అనసరమే'' అన్నారు లారెన్.

అవాంఛిత గర్భం లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధి కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదని ఆమె అన్నారు.

''గర్భాన్ని నిరోధించడానికి కండోమ్‌లు వాడటం మంచిది కాదు. అవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి. దానికన్నా మీ భాగస్వామిని పరీక్షించడం, వారు ఆరోగ్యంగా ఉండటం అన్నింటికన్నా ముఖ్యం'' అన్నారామె.

వాతావరణంపై రీసైక్లింగ్ ప్రభావం

సెక్స్, పర్యావరణం మధ్య ఘర్షణకు కారణమయ్యే మరో అంశం పిల్లల్ని కనడం. 2017 అధ్యయనం ప్రకారం, కార్లు లేకుండా జీవించడం వల్ల సంవత్సరానికి 2.3 టన్నుల CO-2 ఆదా అవుతుంది, అలాగే మొక్కల ఆధారిత ఆహారంతో 0.8 టన్నులు ఆదా అవుతుంది.

ఈ రెండింటిని పోల్చి చూస్తే-మనం అభివృద్ధి చెందిన సమాజంలో జీవిస్తుంటే- పిల్లలను కనకుండా ఉంటే 58.6 టన్నులు CO-2 ఆదా అవుతుంది.

అయితే, కొంతమంది ప్రభావశీలురైన వ్యక్తులు పిల్లల్ని కనకపోవడం గురించి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పర్యావరణంపై ప్రభావం పడకుండా తాను ఇద్దరు పిల్లలతోనే సరిపెడతానని ప్రిన్స్ హ్యారీ 2019లో వోగ్‌తో మాట్లాడుతూ వెల్లడించారు.

''మన పిల్లల భవిష్యత్తును తలుచుకుంటే అమ్మ కావాలన్న నా కల చేదుకలగా మారింది'' అని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ 2019లో జరిగిన సి40 వరల్డ్ మేయర్స్ సదస్సులో వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో జననాల రేటు తగ్గుముఖం పట్టింది. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ ట్రెండ్‌ను కేవలం వాతావరణ మార్పులతోనే సరిదిద్దలేము.

అయితే ఈ సంవత్సరం బ్రిటిష్ శాస్త్రవేత్తలు చేసిన గ్లోబల్ పోల్ సర్వేలో పాల్గొన్న 10,000 మంది యువకులలో మూడొంతుల మంది "భవిష్యత్తు భయానకంగా ఉంది" అని అంగీకరించారు.

దాదాపు 41% మంది వాతావరణ మార్పులను కారణంగా చూపుతూ పిల్లలను కనడానికి వెనకాడుతున్నట్లు చెప్పారు.

'నాకు పిల్లలు వద్దు’

తన్మయ్ షిండే ముంబైలో నివసిస్తున్నారు. పర్యావరణ సమస్యల కారణంగా పిల్లలను కనరాదని ఆయన నిర్ణయించుకున్నారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2050 నాటికి ఆయన పుట్టిన ముంబయి నగరం మునిగిపోయే ప్రమాదంలో ఉందని ఐపీసీసీ నివేదిక ఇటీవలే వెల్లడించింది.

అయితే, ఆయన నిర్ణయాన్ని కుటుంబం అర్థం చేసుకోలేక పోతోంది. "భారతదేశంలోని కుటుంబాలు చాలా సంప్రదాయంగా ఉంటాయి. ఆచారాలు, సంస్కృతికి అలవాటు పడి ఉంటాయి" అని తన్మయ్ అన్నారు.

"వివాహం తర్వాత పిల్లలను కనడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తారు. ఈ సంస్కృతిని కొనసాగించాలని సామాజికంగా ఒత్తిళ్లు కూడా ఉంటాయి " అన్నారాయన.

మరి ఆయన తన మనసు మార్చుకుంటారా?

''పిల్లలను కనడానికి సురక్షితమైన భూమి, అంతే సులభమైన జీవన విధానం చాలా ముఖ్యం. వాతావరణ మార్పులను అరికట్టడానికి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తీసుకున్న నిర్ణయాలు ఆశావహంగా అనిపించే వరకు నేను పిల్లల గురించి ఆలోచించను''అన్నారు తన్మయ్

అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు కర్బన ఉద్గారాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నారని ఒక పరిశోధనలో తేలింది. స్వీడన్‌లోని లండ్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ కింబర్లీ నికోలస్ ఈ అధ్యయనానికి సహ రచయితగా ఉన్నారు.

అయితే, ప్రజలు పిల్లలను కనాల వద్దా అన్నది మనం నిర్ణయించలేమని కింబర్లీ అంటారు. ప్రజలు తమ ప్రయాణ అలవాట్ల గురించి ఆలోచించాలని ఆమె సూచిస్తున్నారు "మన ప్రయత్నాలలో ఎక్కడ తేడా ఉందో దానిపై దృష్టి పెట్టాలి" అని ఆమె అన్నారు.

తన జీవితంలో మూడవ వంతు వ్యర్థాలు లేకుండా గడిపిన వ్యక్తిగా లారెన్ పిల్లలపై నిర్ణయం తీసుకోలేదు. "నేను దత్తత తీసుకోవడం గురించి ఆలోచించాను. ఇది మంచి ఆప్షన్. కానీ అలా చేయడం వల్ల బిడ్డను పొందే అసలు శారీరక ప్రక్రియ గురించి నాకు ఇక ఏమీ తెలియదు" అన్నారామె.

పర్యావరణానికి సంబంధించిన ఇతర నిర్ణయాల మాదిరిగానే, బిడ్డను కనడం "నెట్ పాజిటివ్" కాదా అని ఆమె తనను తాను ప్రశ్నించుకుంటున్నారు.

"దీని వల్ల భూమికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నా కంటే ఎక్కువ కాలం జీవించి, మంచి ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నంలో కొనసాగే ఈ బిడ్డకు నేను విలువ ఇవ్వలేనా?" అన్నది చూసుకోవాలని లారెన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
COP26: What is Eco Friendly Sex and how will it be
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X