మళ్ళీ కరోనా పంజా.. వారంరోజుల్లో అక్కడ భారీగా 25,900కు పైగా కోవిడ్ కేసులు.. అలెర్ట్!!
కరోనా మహమ్మారి.. ప్రపంచాన్ని ఇంకా వదిలిపెట్టలేదు. తాజాగా మరో మారు కలకలం రేపుతోంది. తాజాగా సింగపూర్లో కరోనా కేసులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య 25 వేల 900 కు పైగా కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుంగ్ తెలిపారు. సింగపూర్లో కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉందని, ప్రజలు మాస్కులు ధరించాలని అయన అక్కడి వారికి సూచించారు.
సింగపూర్ ను భయపెడుతున్న కరోనా వ్యాప్తి
కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి జరుగుతుందని, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఒక్క వారం రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది అన్నారు. అంతేకాదు ఆసుపత్రులన్నీ అలర్ట్ కావలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్ని వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రులలో పడకల సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు.

నాలుగు వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా కేసులు
ప్రస్తుతం విపరీతంగా ఉన్న ఉధృతి నాలుగు వారాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని సింగపూర్ ఆరోగ్య మంత్రి ఆంగ్ యే కుంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నిత్యం 250 మంది వరకు ఆసుపత్రులలో చేరుతున్నారని పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా సంసిద్ధం కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
సింగపూర్ దేశంలో కరోనా కొత్తవేవ్
ఏప్రిల్ చివరి వారంలో 13700 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపిన ఆయన, ప్రస్తుతం కరోనా కేసుల ఉధృతి తీవ్రంగా కొనసాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా కొత్త వేవ్ ప్రారంభమైందని పేర్కొన్న సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఈ వేవ్ ను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో తీసుకోవలసిన చర్యలపై సమీక్షలు జరుపుతున్నామని వెల్లడించారు.
రెండు కొత్త వేరియంట్ల ఉధృతి
కోవిడ్ బాధితులను ఆస్పత్రిలో చేర్పించే అవసరం లేకుండా, ఇంటి వద్ద నుండే చికిత్స అందించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సింగపూర్ పౌరులు మరోమారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సింగపూర్లో కేపీ. 1, కేపీ .2 కరోనా వేరియంట్ కేసులు మూడింట రెండు వంతులు నమోదు అవుతున్నాయి అన్నారు.
ఎక్కువ కరోనా కేసులను వ్యాప్తి చేస్తున్న కొత్త రకాలు
ఈ రెండు కరోనా వేరియంట్లు ఎక్కువ వ్యాప్తి చేయగలిగిన, మరింత తీవ్రమైన వ్యాధిని కలిగించే వేరియంట్లని సింగపూర్ ఆరోగ్య శాఖ ఇంకా నిర్ధారించలేదు. అయితే దీనివల్ల వ్యాధి వ్యాప్తి మాత్రం ఎక్కువ జరుగుతుందని పేర్కొన్నారు. అందరూ అలెర్ట్ గా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications